ఫర్హాన్ తో అయేషా పెళ్లి
ముంబై: నాగార్జున 'సూపర్' చిత్రంతో దక్షిణాదిన కాలుపెట్టి మళ్లీ హిందీ సినిమాల వైపు వెళ్లిపోయిన గ్లామర్ నటి అయేషా టకియా తన చిరకాల స్నేహితుడు ఫర్హాన్ అజ్మితో మెడలో మూడు ముళ్ల వేయించుకోనుంది. మార్చి 1న వీరి వివాహం ముంబైలో ముస్లిం సాంప్రదాయం ప్రకారం జరుగనుంది.
ఆంగ్లో ఇండియన్ ముస్లిం అయిన అయేషా బిజినెస్ మన్ ఫర్వాన్ తో కొంతకాలంగా డేటింగ్ చేస్తోంది. గత డిసెంబర్ లోనే వీరి వివాహం జరగాల్సి ఉండగా, ముంబైలో తీవ్రవాదుల దాడి కారణంగా వాయిదా పడింది. అయోషా కెరీర్ కూడా ఇటీవల పెద్దగా ఊపందుకోలేదు.'షాగీ నెంబర్ 1', 'సాచా న థా', 'దిల్ మాంగే మోర్ ', 'టార్జాన్ - ది వండర్ కార్' వంటి పలు చిత్రాల్లో ఆమె నటించింది. ఇటీవల కాలంలో
ఓవర్ వెయిట్ సమస్యను ఎదుర్కొన్నప్పటికీ మళ్లీ ఇప్పుడు ఆమె స్లిమ్ అయింది. ప్రస్తుతం ఆమె సల్మాన్ ఖాన్ తో హిందీ 'పోకిరి'లో నటిస్తోంది. వివాహం తర్వాత సినిమాల్లో కొనసాగడంపై అయేషా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. మార్చి 2న జరిగే రెషెప్షన్ కు టాలీవుడ్ నుంచి నాగార్జున, దర్శకుడు పూరీ జగన్నాథ్ తదితరులు హాజరయ్యే అవకాశాలున్నాయి.
News Posted: 16 February, 2009
|