రెహ్మాన్ స్కూల్ లో లెజెండ్స్
చెన్నై: ఆస్కార్ నామినేటెడ్ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ పలువురు సంగీత దిగ్గజాలను తన మ్యూజిక్ స్కూల్ కు రప్పించనున్నారు. గత ఏడాది మార్చి 12న రెహమాన్ సొంతంగా చెన్నైల్ కె.ఎం.మ్యూజిక్ కన్సర్వేటరీని ఏర్పాటు చేశారు. ఇప్పుడు సెకెండ్ బ్యాచ్ విద్యార్థులు కూడా రాబోతున్న తరుణంలో పంటిట్ రవిశంకర్, జాకిర్ హుస్సేన్, హరిప్రసాద్ చౌరాసియా, అమ్మాద్ అలి ఖాన్, శివశంకర్ శర్మ, కెన్నీ జి, యాన్ని వంటి మ్యూజిక్ లెజెండ్సకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు. 2002లో రెహమాన్ మ్యూజికల్ 'బాంబే డ్రీమ్స్' నిర్మాత ఆండ్రూ లాయిడ్ వెబ్బర్ ను రప్పించేందుకు రెహమాన్ ప్రయత్రాలు చేస్తున్నారు.
సెకెండ్ బ్యాచ్ విద్యార్థులు చేరే సందర్భంతో పాటు స్కూలును చెన్నై శివార్లలోని ఐదెరకాల క్యాంపస్ లోకి మార్చబోతున్న విషయాన్ని కూడా ఇదే కార్యక్రమంలో ప్రకటించనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం రెహమాన్ స్టూడియోస్ లోనే ఈ స్కూలును నిర్వహిస్తున్నారు. కొత్త క్యాంపస్ లో విశాలమైన క్లాస్ రూములు, కన్సర్ట్ హాల్, రికార్డింగ్ స్టూడియో, ఫ్యాకల్టీ విద్యార్థులకు వసతి గదులు కూడా ఉండబోతున్నాయనీ, వచ్చే ఏడాది చివరకు ఈ క్యాంపెస్ రెడీ అవుతుందనీ తెలుస్తోంది 'తమ విద్యార్థులంతా సంగీతంలో సరైన సౌండ్ బేస్, వివిధ జనరేషన్ల మ్యూజిక్ ను అవగతం చేసుకోవాలని రెహమాన్ కోరుకుంటున్నారు. మ్యూజిక్ లెజెండ్స్ ద్వారా విద్యార్థులు ఆ విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. విజిటింగ్ ఫ్యాకల్టీలో ఈ లెజెండ్స్ ను ఉపయోగించుకునే అవకాశాలున్నాయి. ఇందువల్ల వారు నేరుగా ప్రతి విద్యార్థికి కొంత సమయాన్ని వెచ్చించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయడం జరుగుతుంది' అని ఆ వర్గాలు వివరించాయి.
News Posted: 16 February, 2009
|