రణధీర్ తో వెటరన్ బ్యూటీస్
బాలీవుడ్ సినిమా దిగ్గజాల్లో ఒకరైన రణ్ ధీర్ కపూర్ 62వ బర్త్ డే వేడుక చెంబూర్ రెసెడెన్స్ లో (రామ్ కపూర్ బంగ్లా, ఆర్.కె.కాటేజ్ ) అదివారంనాడు ఎంతో కోలాహలంగా జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీకి పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రణ్ ధీర్, ఆయన అతిథులు ఎంతో ఉత్సాహంతో మరెంతో కలుపుకోలుగా పార్టీలో కనిపించడం పార్టీకి ఎంతో నిండుతనం తెచ్చిందనీ, ఆర్.కె. కాటేజ్ లో ఏ ఫంక్షన్ జరిగినా అందుకు ఎంతో ప్రత్యేకత ఉంటుందనీ, ఈ సందర్భం కూడా వాటికి ఏమాత్రం తీసిపేదనీ ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. రణ్ ధీర్ తో కలిసి నటించిన వెటరన్ బ్యూటీస్ రేఖ, శ్రీదేవి, మాధురీ దీక్షిత్ ఈ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని వారు పేర్కొన్నారు.
రణ్ ధీర్ మాజీ భార్య బబిత, కుమార్తెలు కర్మిషా, కరీనా, సైఫ్ అలీ ఖాన్ సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. శ్రీదేవి తన భర్త బోనీకపూర్ తో కలిసి వచ్చారనీ, గత రెండు వారాలుగా ముంబైలోనే ఉన్న మాధురీ దీక్షిత్ ను రణ్ బీర్ వ్యక్తిగతంగా ఆహ్వానించారనీ ఆ వర్గాలు వివిరించాయి. ఇక పార్టీకి హాజరైన రేఖ సైతం రణ్ బీర్ సరసన 12 చిత్రాల్లో నటించిందనీ వారు తెలిపారు. రణ్ దీర్ చిన్న తమ్ముడు రాజీవ్ కపూర్ పుణె నుంచి నేరుగా పార్టీకి హాజరయ్యారు. ఢిల్లీలో అరిందమ్ చౌదరి తీస్తున్న సినిమా షూటింగ్ లో ఉన్నందున రిషీ, నీతూలు పార్టీకి దూరంగా ఉన్నారు.రణ్ బీర్ కపూర్ సైతం రాజ్ కపూర్ సంతోషి తీస్తున్న 'అజబ్ ప్రేమ్ కి గజబ్ కహానీ' షూటింగ్ కోసం టర్నీలో ఉన్నారు. రాకేష్ రోషన్, జితేంద్ర, సుభాష్ ఘై, కేతన్ దేశాయ్, ఆయన భార్య కంచన్ తదితరులు రణ్ ధీర్ బర్త్ డే పార్టీకి హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు.
News Posted: 17 February, 2009
|