'డిల్లీ-6' కు యు|ఏ
'రంగ్ దే బసంతి' సూపర్ హిట్ తర్వాత రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా నుంచి వస్తున్న 'ఢిల్లీ 6' చిత్రం భారీ అంచనాలతో ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అభిషేక్ బచ్చన్, సోనమ్ కపూర్, రిషికపూర్, వహిదా రెహమాన్. ఓంపురి, అతుల్ కులకర్ణి, దివ్యదత్త ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కొన్ని సౌండ్ కట్స్ తో సిబిఎఫ్ఎస్ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ) నుంచి యు|ఏ సర్టిఫికెట్ లభించింది. 8 రీళ్లతో 2 గంటల 18 నిమిషాల నిడివితో ఈ చిత్రం ఉండబోతోంది.
ముంబై దాడుల అనంతరం ఇప్పడిప్పుడే మళ్లీ జనం థియేటర్లకు చేరుకుంటున్న తరుణంలో షారూక్ ఖాన్ 'బిల్లూ' మరికొంత ఊపరి పోసింది. ఈ నేపథ్యంలో వస్తున్న 'ఢిల్లీ 6' చిత్రం థియేటర్ల ముందు ప్రేక్షకులను క్యూలు కట్టిస్తుందని, బాక్సాఫీస్ వసూళ్లను మరింత పెంచుతుందనీ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి తోడు ఈ శుక్రవారం తర్వాత ఎలాంటి పెద్ద రిలీజ్ లు లేకపోవడం కూడా 'ఢిల్లీ 6' కు కలిసొచ్చే ప్రధాన అంశమనీ, అయితే త్వరలో ప్రారంభం కానున్న ఐపిఎల్ ట్వంటీ 20 మ్యాచ్ ల ప్రభావం మాత్రం ఎంతో కొంత ఉండే అవకాశాలు లేకపోలేదనీ విశ్లేషిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం, బినోద్ ప్రధాన్ సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రాన్ని రోనీ స్ర్కూవాలా నిర్మించారు.
News Posted: 19 February, 2009
|