షారూక్ షో జడ్జిగా అనుష్క
న్యూఢిల్లీః 'రబ్ నే బనే దె జోడి' చిత్రంలో షారూక్ సరసన నటించే అవకాశం అందుపుచ్చుకుని మంచి బ్రేక్ సాధించిన అనుష్క శర్మకు మళ్లీ షారూక్ షో కోసం పనిచేసే అవకాశం దక్కింది. షారూక్ రియాల్టీ షో 'నైట్స్ అండ్ ఏంజెల్స్ ' కు జడ్జిగా అనుష్క వ్యవహరించబోతోంది. ఈ రియాల్టీ డాన్స్ హంట్ ద్వారా ఆరుగురు ప్రతిభావంతులైన అమ్మాయిలను ఎంపిక చేయబోతున్నారు. షారూక్ ఖాన్ ఐపిఎల్ టీమ్ 'నైట్ రైడర్స్'కు సంబంధించిన చీర్ లీడర్స్ స్వాడ్ కు ఈ ఆరుగురు నేతృత్వం వహిస్తారు. షారూక్ రియాల్టీ షోకు వి.జె.పూరబ్ కోహ్లి హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు. జడ్జిలలో ఒకరిగా సౌరవ్ గంగూలీ కూడా పాల్గొంటారు.
దేశవ్యాప్తంగా ప్రధానమైన మెట్రో పాలిటన్స్ లో విస్తృతంగా ఆడిషన్ టెస్ట్ నిర్వహించి 24 మంది అమ్మాయిలను ఎంపిక చేస్తారు. వీరిలో స్టయిల్, పెర్సనాలిటీ, హుందాతనం, ప్రవర్తన, రిథమ్, ఉత్సాహం వంటి అంశాల ప్రాతిపదికగా ఆరుగురిని ఫైనల్స్ లో ఎంపిక చేస్తారు. ఈ షోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ షియామక్ దేవర్ కూడా పాల్గొంటారు. ఆరు ఎపిసోడ్ల సిరీర్ గా 'నైట్స్ అండ్ ఏంజెల్స్ ' ప్రతి శనివారం ప్రసారమవుతుంది.
News Posted: 26 February, 2009
|