అక్షయ్ ఫీజు 45 కోట్లు
ఆర్థిక మాంద్యం ప్రభావంతో బాలీవుడ్ హీరోలు తమ పారితోషికాలు తగ్గించుకుంటున్న వినిపిస్తున్న తరుణంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 45 కోట్ల వరకూ తన రెమ్యునరేషన్ ను డిమాండ్ చేస్తున్నారు. 'త్రిదేవ్', 'గుప్త్', 'మొహ్రా' వంటి బ్లాక్ బస్టర్లు తీసిన రాజీవ్ రాయ్ యాక్షన్ జోలిక పోకుండా 'అసంభవ్' చిత్రాన్ని 2004లో తీశారు. ఇన్నాళ్లకు మళ్లీ ఆయన తన మిత్రుడు అక్షయ్ కుమార్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే ఆ చిత్రం ముందుకు కదలని పరిస్థితి ఎదురైంది. అక్షయ్ 45 కోట్లు డిమాండ్ చేస్తుండటంతో రాజీవ్ రాయ్ డిఫెన్స్ లో పడిపోయినట్టు బాలవుడ్ వర్గాల సమాచారం.
అక్షయ్ కుమార్ తో 1994లో 'మొహ్రా' వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని తీసిన రాజీవ్ రాయ్ మళ్లీ అక్షయ్ తోనే ఓ యాక్షన్ చిత్రాన్ని స్వీయదర్శకత్వంలో నిర్మించేందుకు ప్లానింగ్ చేస్తున్నారనీ, ఇందుకోసం 'డు ఆర్ డై', 'టు డు ఆర్ డై', 'హీట్ ' అనే మూడు టైటిల్స్ ను కూడా రిజిస్టర్ చేయించారనీ రాజీవ్ రాయ్ నిర్మాణ సంస్థ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రంలో నటించేందుకు అక్షయ్ కుమార్ కూడా సముఖత వ్యక్తం చేశారనీ, లాస్ ఏంజెల్స్ లో జరుగుతున్న 'కంబఖ్త్ ఇష్క్' షూటింగ్ లో పాల్గొంటున్న అక్షయ్ ను ఇటీవల రాజీవ్ రాయ్ కలుసుకున్నారనీ కూడా వారు తెలిపారు. 'రెమ్యునరేషన్ తో పాటు లాభాల్లో పెర్సంటేజ్, సినిమాకు సంబంధించిన కొన్ని రైట్స్ కూడా కావాలని అక్షయ్ అడిగారు. ఓవరాల్ గా ఆ మొత్తం 45 కోట్ల వరకూ ఉంటుంది' అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అక్షయ్ చెప్పిన రెమ్యునరేషన్ రాజీవ్ కు మింగిడు పడలేదనీ, అందువల్లనే నిర్మాణానికి తటపటాయిస్తున్నారనీ వారు తెలిపారు. 'రాజీవ్ స్టయిలిష్ మేకింగ్ ను దృష్టిలో ఉంచుకుంటే సినిమా బడ్డెట్ 85 నుంచి 90 కోట్ల వరకూ చేరుకుంటుంది. ఆ మొత్తాన్ని మళ్లీ రికవర్ చేసుకోవడం రాజీవ్ కు సాధ్యం కాకపోవచ్చు కూడా' అని ఆ వర్గాలు విశ్లేషించాయి.
News Posted: 26 February, 2009
|