అమీర్ 10 కోట్ల 'కోక్' డీల్!
ముంబాయి: వయో వృద్ధుడైపోతున్న షారుఖ్ ఖాన్ తో ప్రత్యర్ధి కంపెనీ పెప్సి కాంట్రాక్టు రద్దు చేసుకున్న కొద్ది వారాల్లోనే, ఆమిర్ ఖాన్ తో కోక్ కాంట్రాంక్టుపై సంతకాలు చేసింది. షారుఖ్ కంటె కొన్ని నెలలు పెద్దవాడైన ఆమిర్ ఖాన్(43) ప్రస్తుతం గజని సినిమా బాక్సాఫీసు విజయంతో మేఘాల్లో తేలియాడుతున్నాడు. 'ఆమిర్ నిత్య యవ్వనుడైన క్లాస్ నటుడు. అతిగా ప్రచారానికి ఇష్టపడడు. అందువల్ల అతడి తరానికి చెందిన ఇతర నటులు బ్రాండ్ అంబాసిడర్ అవకాశాలు కోల్పోతుండగా, ఆమిర్ కు ఒకదాని తరువాత మరొకటి వచ్చి మీదపడుతున్నాయి' అని ప్రముఖ టాలెంట్ మేనేజిమెంట్ ప్రతినిధి ఒకరు వ్యాఖ్యానించారు.
ఆమిర్ కు కోక్ కాంట్రాక్టు ద్వారా 10 కోట్ల రూపాయలు లభించాయి. ఈ మొత్తం, గత నవంబర్ లో ముగిసిన, షారుఖ్ పెప్సీ కాంట్రాక్టు కంటె 6 కోట్ల రూపాయలు ఎక్కువ. వయసు మీదపడుతున్న షారుఖ్ బ్రాండ్ అంబాసిడర్ ఇమేజికి ఇప్పుడు సరిపోడంటున్నారు. వచ్చే ఐపిఎల్ సీజన్ లో ప్రసారం చేయబోయే యాడ్ చిత్రం షూటింగు ఆమిర్ తో త్వరలోనే ప్రారంభమవుతుంది.
News Posted: 4 March, 2009
|