సన్నీ,కరిష్మాకు కోర్టు సమన్లు
జైపూర్ : పదకొండేళ్ల క్రితం ఒక హిందీ సినిమా షూటింగ్ సందర్భంగా రైల్వే ట్రాపిక్ కు అంతరాయం కలిగించిన కేసులో నటుడు సన్నీడియోల్ , నటి కరిష్మాకపూర్ లను నెలరోజుల్లోగా రైల్వే కోర్టు ముందు హాజరు కావాలనీ, బెయిల్ బాండ్స్ సమర్పించాలని రాజస్థాన్ హైకోర్టు గురువారంనాడు ఆదేశాలు జారీచేసింది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ కేసుపై సన్నీ, కరిష్మా దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ మహేష్ శర్మ తోసిపుచ్చుతూ, జైపూర్ అడిషనల్ చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ (రైల్వే) కోర్టు ముందు హాజరుకావాలనీ, వారెంట్ జారీ చేసినప్పటికీ కోర్టుకు హాజరుకాలేదనే అభియోగం కింద వారు 25 వేల రూపాయల వ్యక్తిగత పూచ్చికత్తు సమర్పించాలనీ ఆదేశించారు.
సన్నీడియోల్, కరిష్మా, ఫైట్ మాస్టర్ టినూ వర్మ, సతీష్ షా 1997లో 'భజ్ రంగ్' సినిమా షూటింగ్ కోసం అజ్వీర్ రైల్వే డివిజన్ పరిథిలోని నరేన రైల్వే స్టేషన్ లోకి అనుమతి లేకుండా ప్రవేశించారనీ, ఎమర్జనీ చైన్ లాగారనీ కేసు నమోదైంది. సాన్ వర్దా గ్రామంలో షూటింగ్ జరుగుతుండగా అక్కడి రైల్వే ట్రాక్ పై రైలు ఆగడంతో దర్శకుడితో పాటు పెద్ద ఎత్తున జనం ఫ్లాట్ ఫామ్ వైపు దూసుకువెళ్లారు. ట్రైను కదలడంతో యూనిట్ సభ్యులు ఎమర్జనీ చైన్ లాగారనీ, దీంతో 25 నిమిషాల పాటు ట్రాఫిక్ కు అంతరాయం కలిగిందంటూ పౌలెర పోలీస్ స్టేషన్ జిపిఆర్ వద్ద ఫిర్యాదు నమోదైంది. సినిమా యూనిట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న జైపూర్ ఎసిజిఎం (రైల్వే) కోర్టు వారికి వారెంట్ జారీ చేసింది.
News Posted: 5 March, 2009
|