ప్రియాంకపై గుర్రుమన్న ఐష్!
ప్రియాంక చోప్రా 'ఫ్యాషన్' చిత్రం కోసం ఈమధ్యనే ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటి అవార్డును అందుకోవడం ఆమెకు పట్టరాని సంబరాన్ని కలిగించి ఉండొచ్చు. అయితే అవార్డు అందుకున్న తర్వాత ఆమె తన స్పందన తెలియజేస్తూ మాట్లాడిన మాటలు నటి ఐశ్వర్యారాయ్ కు తీవ్ర మనస్థాపం కలిగిస్తాయని బహుశా ఆమె ఊహించి ఉండకపోవచ్చు. అయితే జరిగిందదే. దీనికితోడు ఇదే ఫంక్షన్ కోసం అభిషేక్ అనుకున్న 'మ డ లాడ్లా' (దోస్తానా) సాంగ్ నే ప్రియాంక ఎంచుకోవడం సైతం అభిషేక్ ను బాధించిందట.
అందగెత్తె ఐశ్వర్యారాయ్ (జోథా అక్బర్ ), ప్రతిభావంతురాలైన కాజోల్ (యు, మి ఔర్ హమ్ ) వంటి వారితో పాటు తాను కూడా నామినేట్ (ఫ్యాషన్, దోస్తానా) కావడం సంతోషంగా ఉందంటూ ప్రియాంక అవార్డు స్వీకరణ సమయంలో తన స్పందనను తెలియజేసింది. సరిగ్గా ఇక్కడే ఐష్ కు మనస్థాపం కలిగింది. ప్రియాంక తనను అందగెత్తగా అభివర్ణించినప్పటికీ తన నటనా ప్రతిభను విస్మరించిందని ఐష్ అభిప్రాయపడుతోంది. ఇదే ఫంక్షన్ కు హాజరైన ఓ నటుడు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, ప్రియాంక ఆచితూచి మాట్లాడితే బాగుండేదని, ఐశ్వర్య నటనా ప్రతిభను ప్రియాంక ఎలా కాదనగలదనీ వ్యాఖ్యానించారు.'సహజంగా ఐశ్వర్య చాలా కూల్ గా ఉంటుంది. అయితే ఈసారి
ప్రియాంక వ్యాఖ్యాలతో మనస్థాపం చెందింది' అని మరికొందరు తెలియజేశారు.
News Posted: 6 March, 2009
|