'రణబీర్ తో గొడవల్లేవు'
బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే తన తండ్రి ప్రకాష్ పడుకునే అడుగుజాడల్లో నడవనుంది. క్రీడల పట్ల యువతలో ఉన్న ఆసక్తిని వెలికి తీసేందుకు ఒక సంస్థను కూడా ఏర్పాటు చేయబోతోంది. యువ క్రీడాకారులను నిధులను అందిస్తూ ప్రోత్సహించే ఒక సంస్థలో తన తండ్రి భాగస్వామి అనీ, తాను కూడా కొందరికైనా సహాయపడేలా ఒక సంస్థను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాననీ దీపిక తెలిపింది. టిస్సాట్ వాచ్ బ్రాండ్ ప్రమోషన్ ఈవెంట్ లో పాల్గొనేందుకు వచ్చిన దీపిక కొద్దిసేపు ముచ్చిటించింది.
దీపిక పడుకునే కొద్దికాలంగా మరో కారణంగా కూడా వార్తలో ఉంది. ఆమెకు తన బాయ్ ఫ్రెండ్ రణ్ బీర్ తో విభేదాలు తలెత్తాయనీ, కత్రినాకైఫ్ కు రణ్ బీర్ దగ్గరవుతుండటమే ఇందుకు కారణమంటూ వదంతులు బయటకు వచ్చాయి. 'స్వర్గంలో సమస్యలు ఉండవు. మా మధ్య అలాంటి విభేదాలు ఉన్నట్టు నాకే తెలియదు. చాలా వింతగా కూడా ఉంది' అని దీపిక ఈ వదంతికి నవ్వుతూ వివరణ ఇచ్చారు. పరిశ్రమలో ఎదిగే క్రమంలో దీపికలో టెన్సన్, అభద్రతా అడపాదడపా కనిపిస్తుంటుందనే వ్యాఖ్యాలపై స్పందిస్తూ 'నేనేమీ గేమ్స్ ఆడటం లేదు' అన్నారు. నటన అనేది తన వృత్తి అనీ, ఆ వృత్తిమీదే పూర్తి దృష్టి కేంద్రీకరిస్తున్నాననీ, వృత్తిని ఎంజాయ్ చేస్తున్నాననీ ఆమె చెప్పారు. ఈ క్రియేటివిటీ రంగంలో పనిని ప్రేమించడం ఒక్కటే ముఖ్యమనీ, అలా చేసినప్పుడు ఫలితం వెన్నంటే ఉంటుందనీ అన్నారు. 'చాందినీ చౌక్ టు చైనా' తరహాలోనే ఆమె నటించిన చిత్రం ఏదైనా నిరాశపరస్తే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందని అడిగినప్పుడు 'ఏడుస్తూ మాత్రం కూర్చోను. అయితే నిరుత్సాహపడతాను. నిజానికి ఏ సినిమాకైనా మేమంతా చాలా కష్టపడతాం. మా జీవితంలో ఎక్కువ భాగం సినిమా కోసమే పనిచేస్తాం' అంటూ వృత్తి పట్ల తనకున్న అంకింత భావాన్ని దీపిక చాటుకుంది.
News Posted: 7 March, 2009
|