జీనత్ అమన్ అనగానే...70-80 దశకాల్లో తన అందచందాలతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన సెక్సీ క్వీన్ మన కళ్ల ముందు మెదలుతుంది. అభిషేక్ బచ్చన్ చిన్నప్పుడు ఓసారి జీనత్ ను అమాయకంగా 'నీతో కలిసి పడుకోవచ్చా?' అని అడిగాడట. అభిషేక్ తరచు తన తండ్రి అమితాబ్ బచ్చన్ తో కలిసి ఔట్ డోర్ షూటింగ్ లకు వెళ్లడానికి ఇష్టపడేవారు. 1983లో అమితాబ్ తో కలిసి 'మహాన్' షూటింగ్ కు చిన్నారి అభిషేక్ వెళ్లాడు. ఆ సినిమాలో అమితాబ్ తో కలిసి జీనత్ అమన్ నటించింది. అలనాడు జీనత్ అమన్ అంటే తనకెంత క్రేజ్ ఉండేదో ఫర్వా అఖ్తార్ ఛాట్ షో 'ఓయే ఇట్స్ ఫ్రైడే' లో జూనియర్ బచ్చన్ వెల్లడించారు.
'ఆరోజు సినిమా యూనిట్ అంతా కలిసి డిన్నర్ చేశారు. జీనత్ తన డిన్నర్ అయిన వెంటనే బెడ్ రూమ్ లోకి వెళ్లిపోయింది. నేను ఆమెను అనుసరిస్తూ నేను కూడా నీ గదిలో నీతో పాటు పడుకోవచ్చా' అనే కోరికను వ్యక్తం చేశారు. అప్పుడు చిన్నతనం కావడంతో అమాయకంగా అలా అడిగినందుకు జీనత్ కు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్నానని జూనియర్ బచ్చన్ నవ్వుతూ ఓ కంక్లూజన్ కూడా ఇచ్చారు. ఈ 'ఓయే ఇట్స్ ఫ్రైడే' ఎపిసోడ్ ఈనెల 13వ తేదీ రాత్రి 10 గంటలకు ఎన్డీటీవీ ఇమేజిన్ లో ప్రసారంకానుంది.