నీల్ ముఖేష్ తో శ్రీశాంత్
'జానీ గద్దార్'తో గత ఏడాది బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ప్రముఖ సింగర్ ముఖేష్ మనువడు నీల్ నితిన్ ముఖేష్ కు బెంగుళూరులో ఊహించిన అతిథి ఎదురుకావడం ఆశ్చర్యంలో ముంతెత్తింది. నీల్ తన తాజా చిత్రం 'ఆ దేఖే జరా' ప్రమోషన్ వర్క్ లో భాగంగా ఆదివారంనాడు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ క్షణంలో అనుకోని అతిథి ఒకరు నేరుగా అక్కడకు రావడంతో నీల్ ఆనందానికి కూడా పట్టపగ్గాలు లేవు. ఆ వచ్చిన గెస్ట్ మరెవరో కాదు. నీల్ మిత్రుడు, ఇండియన్ స్టార్ క్రికెటర్ శ్రీకాంత్.
నీల్, శ్రీశాంత్ చాలాకాలంగా మంచి మిత్రులనీ, నీల్ ప్రస్తుతం 'ఆజ్ దఖే జరా' చిత్రం ప్రమోషన్ వర్క్ లో భాగంగా వివిధ సిటీల్లో పర్యటిస్తూ బెంగుళూరు వచ్చారనీ ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. శ్రీశాంత్ కు ఈ విషయం తెలియడంలో ఆయన నేరుగా ప్రెస్ మీట్ జరుగుతున్న ప్రదేశానికి వచ్చారు. ఆ తర్వాత నీల్ ను వెంటపెట్టుకుని తన బ్యాట్ అండ్ బాల్ రెస్టారెంట్ కు తీసుకువెళ్లారు. అక్కడ నైట్ అవుట్ కూడా చేశారు. నీల్ ను ఈ విషయమై సంప్రదించినప్పుడు ఏడాది నుంచి తనకు శ్రీశాంత్ తెలుసునని చెప్పారు. ముంబైలో ఒక సందర్భంగా తాము కలిసినప్పుడు మంచి ఫ్రెండ్స్ అయ్యామనీ, అప్పట్నించీ నేను బెంగుళురు వచ్చినప్పుడు, ఆయన ముంబై వచ్చినప్పుడు కలుస్తూనే ఉన్నామని అన్నారు. శ్రీశాంత్ గతంలో తమ ఇంటికి కూడా వచ్చాడనీ, తన తల్లిదండ్రులకు కూడా అతన్ని ఎంతగానో అభిమానిస్తారనీ తెలిపారు. తాను బెంగుళూరు వచ్చినట్టు తెలుసుకుని శ్రీకాంత్ రావడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందనీ, ఆ తర్వాత ఆయన సర్ ప్రైజ్ పార్టీ ఇచ్చారనీ తెలిపారు. శ్రీశాంత్ ఎంత పాపులారిటీ ఉన్న వ్యక్తి అయినప్పటికీ తమ పట్ల ఎంతో అభిమానం చూపించడం మెచ్చుకోలైన విషయమని ప్రశంసించారు.
News Posted: 10 March, 2009
|