శిల్పాశెట్టి పెళ్లి ఉంగరం
శిల్లాశెట్టి చేతికి పెళ్లి ఉంగరం వచ్చి చేరింది. ఇక తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుంద్రాతో వచ్చే ఏడాది మెడలో మూడు ముళ్లు వేయించుకోవడమే తరువాయి. శిల్పా, రాజ్ కుంద్రా ఇప్పుడు ఐపిఎల్ క్రికెట్ టీమ్ లో స్టేక్ తీసుకుని వ్యాపార భాగస్వాములు కూడా అయ్యారు.తమ క్రికెట్ టీమ్ కు ఈమధ్యనే చాలా గ్రాండ్ గా ఓ పార్టీ కూడా ఎరేంజ్ చేశారు. శిల్పాశెట్టి తన ఆనందాన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి మరో కారణం కూడా ఉంది.
ఈమధ్యనే 'వాలంటైన్స్ డే' కానుకగా శిల్పాకు రాజ్ కుంద్రా ఓ భారీ బహుమతే ఇచ్చారు. శిల్పాను ఆశ్యర్యంలో ముంచెత్తుతూ అత్యంత ఖరీదైన ఓ డైమండ్ ఉంగరాన్ని ప్రెజెంట్ చేశారు. ఉంగంరంతో పాటు పెళ్లి ప్రపోజల్ కూడా చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. 'శిల్పా ఈ పరిణామాలను ఊహించి ఉండదు. రాజ్ స్వయంగా వెళ్లి ఉంగారాన్ని సెలక్ట్ చేసి ప్రేమికుల రోజున ప్రెజెంట్ చేయడం ద్వారా ఆమెను ఆశ్చర్యంలో ముంచెత్తాడు' అని ఆ వర్గాలు తెలిపాయి. ఇప్పుడు ఆ రింగ్ శిల్పా చేతికే ఉంది. మరి పెళ్లి ఇకెంత దూరంలో ఉండి ఉండొచ్చు? ఈ ఏడాది చివర్లో ఉండొచ్చని శిల్పా సన్నిహితురాలు ఒకరు తెలిపారు. శిల్పాను అడిగితే ఆమె సంతోషంతో కూడిన ఎగ్జయిమెంట్ కనబరచింది. 'రాజ్ చాలా ప్రత్యేకమైన వ్యక్తి. తప్పనిసరిగా మేము పెళ్లి చేసుకుంటాం.అయితే ఈ ఏడాది చివర్లో మాత్రం కాదు' అని శిల్పా తెలివిగా సమాధానమిచ్చింది. బహుశా వచ్చే ఏడాది ప్రారంభంలో అనుకోవచ్చా?!
News Posted: 12 March, 2009
|