సుఖ్వీందర్ కు కుచ్చుటోపీ!
ముంబైః ఇండియన్ పాపులర్ సింగర్ సుఖ్వీందర్ సింగ్ పాడిన 'జయ హో' పాట ఆమధ్యనే ఆస్కార్ గెలుచుకుంది. సుఖ్వీందర్ ఒక్కసారిగా ఇంటర్నేషనల్ సర్కిల్స్ లోనూ పాపులర్ అయ్యారు. ఆ మాట అటుంచింతే..సుఖ్వీందర్ కు ఈమధ్యనే ఓ విషయం తెలిసి షాక్ తిన్నంత పనైంది. గత 12 నెలల్లో 20 కోట్ల రూపాయలకు పైగా ఆయన మోసపోవడమే ఇందుకు కారణం. కొంత మంది దళారీలు తాము సుఖ్వీందర్ మేనజర్లమని చెప్పుకొని స్టేజ్ షోల కోసం సహజంగా ఆయన తీసుకునే మొత్తానికి మూడు నుండి నాలుగు రెట్లు అధికంగా వసూలు చేసి తమ జోబుల్లో పడేసుకున్నారట. గత ఏడాది ఢిల్లీ, అమృత్ సర్ లలో జరిగిన రెండు స్టేజ్ లకు ముందు ఇలాంటి డీలింగ్స్ కుదరడం సుఖ్వీందర్ ను దిగ్ర్భాంతికి గురి చేసినట్టు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి.
జయహో పాటకు ఆస్కార్ వచ్చిన తర్వాత కొందరు సుఖ్వీందర్ గౌరవార్దం ఓ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీలో ఒక వ్యక్తి ఆయన వద్దకు వద్దకు నేరుగా వచ్చి ఒక స్టేజ్ షో కోసం ఆయనను ఆహ్వానించాలని అనుకున్నప్పటికీ, పారితోషికం 35 లక్షలంటూ మేనేజర్ చెప్పడంతో ఆ ఆలోచన విరమించుకున్నాననని పేర్కొన్నారు. దీంతో సుఖ్వీందర్ షాక్ తిన్నారు.తాను ఎప్పుడూ అంత మొత్తం డిమాండ్ చేయలేదని సుఖ్వీందర్ గ్రహించారనీ, ఈవెంట్ ఆర్గనైజర్ల ముసుగులో కొందరు దళారుల రాకెట్ నడుపుతున్నారని ఆయన అభిప్రాయపడుతున్నారనీ ఆ వర్గాలు వివరించారు. 'సహజంగా ఎవరైనా మా సెక్రటరీని కాంటాక్ట్ చేస్తారు. నా డేట్లు తీసుకుంటారు. నా ఫీజు చెల్లించడంతో వారి కోరిన చేట ప్రదర్శన ఇస్తుంటాను. అయితే నా కోసం ఎంత చెల్లించారనే విషయాన్ని మాత్రం ఎప్పుడూ ఈవెంట్ ఆర్గనేజర్లతో ముచ్చటించ లేదు.అదే పెద్ద
తప్పయింది.చాలామంది పెద్ద మొత్తాలు చెల్లించినప్పటికీ అందులో నాకు దక్కింది మూడో వంతు మాత్రమే' అని సుఖ్వీందర్ తెలిపారు. సరైన సాక్ష్యాలు సేకరించిన తర్వాత పోలీసు కంప్లయింట్ ఇస్తానని ఆయన స్పష్టం చేసారు.
News Posted: 12 March, 2009
|