అభిషేక్ 15 కోట్ల 'ఐడియా'
అమితాబ్ బచ్చన్, అనిల్ అంబానీ చాలా మంచి మిత్రులనేది అందరికీ తెలిసిన విషయం. ఇక అభిషేక్ బచ్చన్ అంటే అంబానీలు ఎంతగా ఇష్టపడతారో తెలియని వారు కూడా ఉండరు. గత ఏడాది అభిషేక్ ఓ ఇంటర్వ్యూలో మరో అడుగు ముందుకు వేసి 'అనిల్ అంకుల్, టినా ఆంటీ నా కుటుంబ సభ్యులు. నేనెప్పుడూ వారి వెంటే ఉంటాను' అంటూ తన అభిమానం చాటుకున్నారు.
ఇప్పుడు అడ్వర్ టైజ్ మెంట్ సర్కిల్స్ లో ఓ వార్త సంచలనం అయింది. అనిల్ అంబానీ 'రిలయెన్స్ మొబైల్' కు బదులుగా ఆదిత్య బిర్లా గ్రూప్ 'ఐడియా సెల్యులార్'ను అభిషేక్ అందిపుచ్చుకోవడమే ఇందుకు కారణం. ఈ మేరకు అగ్రిమెంట్ కూడా కుదిరింది. 'అనిల్ కూ, అభిషేక్ కూ సత్సంధాలు ఉన్నాయి. అలాగే కుమార్ మంగళం బిర్లాతో కూడా అభిషేక్ కు మంచి అనుబంధం ఉంది. దాంతో ఐడియా ఆఫర్ ను అభిషేక్ కాదనలేకపోయారు' అని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. అభిషేక్ ను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవాలని ఇటు రిలయెన్స్, అటు ఐడియా ఆసక్తి చూపించాయనీ, అయితే ఐడియా నుంచి 15 కోట్ల రూపాయల ఆఫర్ రావడంతో అభిషేక్ వెంటనే అగ్రిమెంట్ చేసుకున్నారనీ ఆ వర్గాలు తెలిపాయి. అడ్వర్ టైజింగ్ ఇండస్ట్రీకి చెందిన ఓ వ్యక్తిని తరచి తరచి అడిగినప్పుడు 'అభిషేక్ ఇప్పటికే అనిల్ అంబానీ కెంపెనీకి చెందిన బిగ్ 92.7 ఎఫ్.ఎమ్. కమర్షియల్ కు పనిచేశారు. రిలయెన్స్ బ్రాండ్ అంబాసిడర్ గా అభిషేక్ ను తీసుకోవాలని అనిల్ అబానీ కోరుకున్న మాట కూడా నిజం. అయితే అభిషేక్ ఆ ఆఫర్ ను అందిపుచ్చుకోలేదు. ఇందుకు ఇంకేవో కారణాలు ఉండొచ్చు' అని ఆ వ్యక్తి వ్యాఖ్యానించారు.
News Posted: 17 March, 2009
|