'8x10'కు లైన్ క్లియర్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ '8x10 తస్వీర్' చిత్రం విడుదలకు మార్గం సుగగమైంది. ఏప్రిల్ 3న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది. 4వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా మల్టీప్లెక్స్ లో సినిమాలు విడుదల కాకుండా బ్యాన్ విధించాలని నిర్మాతల గిల్డ్ నిర్ణయించిన తరుణంలో నిషేధానికి ఒకరోజు ముందే '8x10 తస్వీర్' లైన్ క్లియర్ చేసుకుంది. నిజానికి 3వ తేదీ నుంచి బ్యాన్ అమలుచేయాలని గిల్డ్ నిర్ణయించినప్పటికీ ఈ చిత్ర నిర్మాతలైన పెర్ సెప్ట్ పిక్చర్స్ కంపెనీ తమ వాదనను గిల్డ్ ముందించి వారిని ఒప్పించ గలిగింది. ఈ విషయాన్ని గిల్డ్ ప్రతినిధి ఒకరు ధ్రువీకరించారు. 'తస్వీర్' చిత్రం విడుదలలో ఇప్పటికే జాప్యం జరిగిందనీ, మల్టీపెక్స్ లకు సినిమాలు రిలీజ్ చేయకూడదని తాము తీసుకున్న నిర్ణయం, ఐపిఎల్ మ్యాచ్ ల వల్ల మరింత జాప్యం ఏర్పడే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకుని సినిమా విడుదలకు మార్గం సుగమం చేశామని ఆయన తెలిపారు.
ఏప్రిల్ 3న 'తస్వీర్' చిత్రాన్ని రీలీజ్ చేయబోతున్నట్టు పెర్ సెప్ట్ కంపెనీ ప్రతినిధి ఒకరు నిర్దారించారు. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సంఘాలు తమ చిత్రం విడుదలకు సమ్మతించాయని తెలిపారు, రిలీజ్ కు వ్యవధి తక్కువగా ఉన్నందున అవిశ్రాంతగా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుతున్నామనీ, సినిమాలో విజువల్ ఎఫెక్ట్ కు ఎక్కువ ప్రాధాన్యం ఉందనీ చెప్పారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్షయ్ కుమార్ కు కూడా ప్రిస్టేజియస్ కానుంది. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన 'చాంద్ నీ చౌక్ టు చైనా' చిత్రం బాక్సాఫీస్ ను ఆకట్టుకోకపోవడంతో ఈసారి హిట్ అనివార్యమవువుతోంది. అయేషా టకియా, షర్మిలా ఠూగర్, జావెద్ జఫ్రీ, గిరీష్ కన్నాడ్ వంటి పలువురు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. పెర్ సెప్ట్ కంపెనీ సైతం ఈసారి ఎంతో ప్లానింగ్ గా సినిమా రిలీజ్ కు సన్నాహాలు చేస్తోంది. సహజంగా అక్షయ్ నటించిన సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 1500 నుంచి 1800 స్క్రీనింగ్ లలో విడుదలవుతుంటుంది. ఈసారి మాత్రం 1200 నుంచి 1400 స్క్రీన్స్ మించకుండా ప్రిండ్లు రిలీజ్ చేసేందుకు నిర్మాతలు చర్యలు తీసుకుంటున్నారు.
News Posted: 23 March, 2009
|