రెహ్మాన్ కు లండన్ డాక్టరేట్
జంట 'ఆస్కార్'ల పంట పండించుకున్న ఎ.ఆర్.రెహ్మాన్ పేరు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఇక బిరుదులు, సత్కారాలైతే ఆయన్ను వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయి. సంగీతరంగంలో ఆయన చేసిన విశేష కృషికి గాను చెన్నైలోని అన్నా యూనివర్శిటీ ఇప్పటికే ఆయన గౌరవ డాక్టరేట్ ఇవ్వగా, ఇప్పుడు లండన్ లోని ప్రఖ్యాత మిడిలెస్సెక్స్ యూనివర్శిటీ వంతు వచ్చింది. రెహ్మన్ కు తమ యూనివర్శిటీ తరఫున గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయాలని నిర్ణయించింది. చెన్నైలో సొంతంగా కె.ఎం. మ్యూజిక్ కన్సర్వేటరీని ఏర్పాటు చేసిన రెహ్మాన్ ను యూనివర్శిటీ అధికారులు కలుసుకుని జూలైలో యూనివర్శిటీలో జరుగనున్న గ్రాడ్యుయేషన్ సెర్మనీలో ఈ అవార్డు ప్రదానం చేయాలని అనుకుటుంన్నట్టు తెలియజేశారు.
మిడిలెస్సెక్ యూనివర్శిటీతో రెహ్మాన్ అసోసియేషన్ డాక్టరేట్ ప్రధానం వరకే పరమితం కాబోవడం లేదు. గత ఏడాది కె.ఎం.మ్యూజిక్ కన్జర్వేటరీ అండ్ ఆడియో మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్రారంభమైంది. ఇండియన్ స్టూడెంట్లకు వెస్ట్రన్ మ్యూజిక్ లోనూ, కంపోజిషన్, మ్యూజిక్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడం ద్వారా అంతర్జాతీయ వేదకలపై పోటీపడేలా వారిని తీర్చిదిద్దాలన్నదే వీరి ప్రధాన ఆశయం. సొంత వాద్యకారులతో సింఫొనీ ఆర్కెస్ట్రా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా ఉంది. ఈ క్రమంలో మ్యూజిక్ కంపోజిషన్, మ్యూజిక్ పెర్ ఫారమెన్స్ కు సంబంధించి విద్యావిషయక గుర్తింపు లభించే విషయంపై మిడిలెస్సెక్స్ యూనివర్శిటీ దక్షిణాసియా ప్రాంతీయ వ్యవహారాల డెరెక్టర్ తో రెహ్మాన్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇది మూడేళ్ల ప్రోగ్రామ్ గా ఉంటుంది. మొదటి రెండేళ్లూ చెన్నైలోని కెఎం కన్జర్వేటరీలోనూ, చివరి ఏడాది లండన్ లోనూ కోర్సు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ఇంటర్మీడియట్ కనీస అర్హత అవుతుంది. ఏడాది పాటు కెఎం మ్యూజిక్ కన్జర్వేటరీ ఫౌండేషన్ ప్రోగ్రాంలో శిక్షణ తీసుకని ఉండాలి. ఈ కోర్సు 2010 జనవరి నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
News Posted: 2 April, 2009
|