'పానసోనిక్' పట్టిన రణ్ బీర్
'పెప్సీ' బ్రాండ్ అంబాసిడర్ గా తన ప్రత్యేకత చాటుచుకున్న 'సావరియా' హీరో రణ్ బీర్ కపూర్ ఇప్పుడు కన్స్యూమర్ గూడ్స్ జెయింట్ 'పానసోనిక్ ఇండియా' తరఫున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించనున్నారు. ఇంతవరకూ రణ్ బీర్ అంగీకరించిన రెండో పెద్ద డీల్ ఇది. పానసోనిక్ వయెర్ర ఎల్ సిడిలు, ప్లాస్మామ్, టెలివిజన్, హోమ్ థియేటర్ వంటి ఉత్పత్తులకు ఇండియా వ్యాప్తంగా ప్రమోషన్ చేపట్టేందుకు ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఇందుకు సంబంధించిన న్యూఢిల్లీలోని అశోక్ హోటల్ లో శనివారం జరిగిన ఈవెంట్ లో రణ్ బీర్, పానసోనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అధికారులు పాల్గొన్నారు.
రణ్ బీర్ మాట్లాడుతూ, తన సినిమాలను ఎలాగైతే జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటానో పానసోనిక్ బ్రాండ్ విషయంలోనూ ఎంతో కేర్ ఫుల్ గా ఆలోచించి మరీ ఒప్పుకున్నాననీ, తన మనసుకు నచ్చిన బ్రాండ్ ఇదనీ చెప్పారు. పానసోనిక్ ఉత్పత్తులతో తనకు చిన్ననాటి నుంచి అనుబంధం ఉందన్నారు. తన చిన్నప్పుడు నాన్నగారు (రిషీకపూర్) ఇదే కంపెనీకి చెందిన స్పీకర్లు తీసుకురావడం తనకు ఇప్పటికీ గుర్తుందనీ, ఇప్పటికీ తన ఇంట్లో ఉన్న టెలిఫోన్లు, టెలివిజన్లు ఇదే కంపెనీ బ్రాండ్ వనీ చెప్పారు. సినిమాల ద్వారా కూడా బ్రాండ్ ప్రమోషన్ చేస్తారా అని అడిగినప్పుడు, టీవీ సెట్ అవసరమైన సన్నివేశం ఏదైనా ఉన్నట్టయితే పానసోనిక్ ను ఉపయోగించమని తప్పనిసరిగా నిర్మాతలను కోరతానని నవ్వుతూ సమాధానమిచ్చారు. ఈ బ్రాండ్ కు రణ్ బీర్ అయితేనే సరిగ్గా సరిపోతాడని తాము భావించినట్టు పానసోనిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ మనీష్ శర్మ తెలిపారు. మంచి పేరు, ప్రమోషన్ వర్క్ ద్వారా ఆకట్టుకోవడం వంటి లక్షణాలున్న వ్యక్తి కోసం తాము రీసెర్చి చేసి మరీ రణ్ బీర్ ను ఎంపిక చేసినట్టు చెప్పారు. రణ్ బీర్ ఎంతో కూల్ గా, ట్రెండీ ఇమేజ్ తో తమ బ్రాండ్ కు మంచిపేరు తెచ్చిపెడతారని అన్నారు. ఏళ్ల తరబడి పానసోనిక్ ఉత్పత్తులకు ఉన్న బ్రాండ్ ఇమేజ్ ను మల్టీ మీడియా ద్వారా రణ్ బీర్ ప్రచారం చేస్తారని తెలిపారు.
News Posted: 4 April, 2009
|