ప్రపంచ సుందరీమణుల్లో ఫ్రిదా
'స్లమ్ డాగ్ మిలనీయర్' చిత్రంలో లతికగా ప్రపంచ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఫ్రిదా పింటో ఇప్పుడు ప్రపంచ సుందరీ మణుల రేసులో పోటీపడుతోంది. ప్రపంచ అపూరూప సౌందర్యరాశిని ఎంపిక చేసేందుకు 'వానిటీ ఫెయిర్' మ్యాగజైన్ ఇటీవల ఓ పోల్ నిర్వహించింది. 19 మంది పేర్లు షార్ట్ లిస్ట్ కాగా, వీరిలో పింటోకు చోటు దక్కడం విశేషం. పింటోతో పాటు 'వరల్డ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఉమన్' టైటిల్ కోసం పోటీ పడుతున్న వారిలో హలే బెర్రీ, కటె బ్లాన్ చెట్, పెనెలోప్ క్రుజ్, స్కార్లెట్ జోహాన్సన్, ఆంజెలినా జోలియా, జోర్డాన్ క్వీన్ రానియా, ఫ్రెంచ్ ఫస్ట్ లేడీ కార్ల బ్రూని తదితరులు ఉన్నారు.
హేమాహేమీల మధ్య గట్టి పోటీ ఉన్నప్పటికీ తొలిచిత్రం 'స్లమ్ డాగ్ మిలయనీర్' పలు ఆస్కార్ లు అందుకున్న నేపథ్యంలో ఫ్రిదాకు మంచి ఛాన్సే ఉందనుకోవచ్చు. ప్రస్తుతం 3 ఆస్కార్లందుకున్న వూడీ అలెన్ తాజా చిత్రంలో ఎంపిక కావడం, బాండ్ సినిమాలో సైతం ఆమె పేరు పరిశీలనలో ఉండటంతో సెలబ్రెటీ స్టాటస్ ను సైతం ఫ్రిదా ఎంజాయ్ చేస్తోంది.
News Posted: 13 April, 2009
|