ఆసిన్ బెడ్రూమ్ లో సల్మాన్?
అమీర్ ఖాన్ 'గజనీ' చిత్రంతో హిందీలోకి అడుగుపెట్టిన ఆసిన్ ఇప్పుడు కత్రినా కైఫ్, దీపికా పడుకునే వంటి హీరోయిన్లకు గట్టి పోటీ అయి కూర్చుంది. దీనికి తగ్గట్టే ఖాన్ హీరోలతో ఆసిన్ తో ఎఫైర్లు అంటగడుతూ వస్తున్న వదంతులు కూడా అదనపు పబ్లిసిటీ అవుతోంది. 'గజనీ' సమయంలో అమీర్ తో ఆసిన్ కు ఎఫైర్ అంటగట్టారు. ఇప్పుడు కండల వీరుడు, 43 ఏళ్ల ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ తో ఆసిన్ ఎఫైర్ల గురించి ప్రచారం మొదలైంది. ఇద్దరూ కలిసి 'లండన్ డ్రీమ్స్' చిత్రంలో నటిస్తుండటంతో ఈ వదంతుల జోరు కూడా పెరిగింది. ఆసిన్ బెడ్ రూమ్ నిండా సల్మాన్ ఫోటోలే ఉన్నాయంటూ కొన్ని టాబ్లాయెడ్స్ లో వార్తలు వచ్చాయి. ఇటీవల ముంబైలో తాను బ్రాండ్ అంబాసిడర్ పనిచేస్తున్న ఓ ప్రొడక్ట్ కోసం ర్యాంప్ వాక్ లో పాల్గొన్న ఆసిన్ ఈ వందుతుల గురించి ప్రశ్నించినప్పుడు వాటిని తేలిగ్గా కొట్టిపారేసింది. సల్మాన్ కూ తనకు మధ్య వృత్తిపరమైన అనుబంధం మినహాయిస్తే మరొకటి లేదని తేల్చిచెప్పింది.
'మేమిద్దరం కలిసి నటిస్తున్నాం. అంతకు మించి ఒక ముక్క ఎక్కువ చెప్పడానికి కానీ తక్కువ చెప్పడానికి కానీ ఏమీ లేదు' అంటూ ఘాటుగానే స్పందించింది. బెడ్ రూమ్ లో సల్మాన్ ఫోటోల వ్యవహారమో అని అడిగితే 'నా బెడ్ రూమ్ లో ఎవరికీ ప్రవేశం లేదు' అంటూ ముక్కు సూటి సమాధానం ఇచ్చింది. ఆసిన్ వివరణ తర్వాతైనే ఈ వదంతులకు తెరపడతాయని అనుకుందాం.
News Posted: 14 April, 2009
|