'గే' మ్యాగజైన్ లాంచ్
'గే' (హోమో సెక్సువల్) కమ్యూనిటీ హక్కుల కోసం విస్తృత ప్రచారం చేపట్టడంలో బాలీవుడ్ హాటెస్ట్ గాళ్ సెలీనా జైట్లీ ఎప్పుడూ ముందుంటారు. ఆ కమ్యూనిటీ పట్ల తనకున్న నిబద్ధతను సెలీనా మరోసారి చాటుకుంది. 'బాంబే దోస్త్' అనే 'గే' మ్యాగజైన్ ను సలీనా తన చేతులమీదుగా ఆదివారంనాడు ముంబైలో రిలీజ్ చేసింది. ఇది ఇండియాలోని తొలి రిజిస్టర్డ్ గే మ్యాగజైన్ కావడం విశేషం. హమ్సఫర్ ట్రస్ట్ సిఇఓ వివేక్ రాజ్ ఆనంద్ హోస్ట్ గా హాజరయ్యారు.
కమ్యూనిటీ సమస్యల పట్ల ఓపెన్ గా తన అభిప్రాయలను చెప్పడంలో ఎప్పుడూ ముందుండే సెలీనా వారికి చేతనంతన చేయూత నిస్తుండటం ముదావహమని వివేక్ రాజ్ ప్రశంసించారు. సమాజంలో ఏ మాత్రం గుర్తింపు పొందని కమ్యూనిటీల ఇబ్బందులను తాము ఎప్పటికప్పుడు ఎలా ఫోకస్ చేస్తున్నామనేది వ్యవస్థాపక సంపాదకుడు అశోక్ వివరించారు. తానేదో గొప్ప ఛారిటీ చేశానని అనుకోవడం లేదని సెలీనా వినమ్రంగా చెప్పారు. జీవించడమనేది ప్రతి ఒక్కరి హక్కనీ, అందరితో సమానంగా ఆదరాభిమానులు చూరగొనడానికి స్వలింగ సంపర్కులు అర్హులనీ ఆమె పేర్కొన్నారు. స్పాన్సరర్లు లభించేంతవరకూ వారి ట్రస్ట్ కు తన సొంత సొమ్ముతో స్వచ్ఛందంగా సహాయం అందించగలననీ ఆమె హామీ ఇచ్చారు.
News Posted: 20 April, 2009
|