యూరప్ లో ఐష్-అభి పెళ్లిరోజు
కాలచక్రం ఎవరి కోసం ఆగదు. గిర్రున తిరిగిపోతుంటుంది. ఐశ్వర్యారాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్ దంపతులై సోమవారంతో రెండేళ్లు పూర్తయింది. ఈ జంట ప్రస్తుతం యూరప్ లో తమ సెకెండ్ వెడ్డింగ్ యానివర్శరీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఇదే తేదీల్లో మణిరత్నం 'రావణ్' చిత్రం షెడ్యూల్ లో ఐష్, అభి పాల్గొనవలసి ఉంది. అయితే దర్శకుడు మణిరత్నం ఇటీవల స్వల్ప గుండెపోటుతో ఆసుపత్రిలో చేరడంతో ఊహించని విధంగా షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. ఈ బ్రేక్ ను సద్వినియోగం చేసుకుంటూ ఐష్-అభి జంట యూరప్ ట్రిప్ కు వెళ్లారు.
నిజానికి ఐశ్వర్య, అభిషేక్ ల వివాహ వార్షికోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని మణిరత్నం హాలీడే డిక్లేర్ చేసినప్పటికీ ఆ జంట నిరాకరించిందనీ, సకాలంలో సినిమా పూర్తి చేయడానికే మొగ్గుచూపిందనీ యూనిట్ వర్గాలు తెలిపాయి. గత ఏడాది సైతం ఐష్, అభి తమ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోలేదు. తేజి బచ్చన్ కాలం చేయడంతో వారు ఆ వేడుకకు దూరంగా ఉన్నారు. అయితే ఈ ఏడాది ఇద్దరూ ఒకే సినిమా షెడ్యూల్ లో ఉండటం, బ్రేక్ రావడంతో జంటగా మధుర క్షణాలు పంచుకునేందుకు యూరప్ బయలుదేరి వెళ్లారు. షార్ట్ హాలిడే ట్రిప్ అనంతరం ఈ జంట ముంబై చేరుకుంటుది.
News Posted: 21 April, 2009
|