'న్యూడ్ సీన్ లో నటించను'
సాంప్రదాయలకు విలువనిచ్చే కుటుంబం నుంచి తాను వచ్చాననీ, తనకు తుపాకీ ఎక్కుపెట్టి నగ్నంగా నటించమన్నా అందుకు ఒప్పుకునే ప్రసక్తే లేదనీ బాలీవుడ్ హాటెస్ట్ గాళ్ కంగనా రనౌత్ తేల్చిచెప్పింది. కంగనా తాజాగా తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఏక్ నిరంజన్' చిత్రంలో ప్రభాస్ కు జోడిగా నటిస్తోంది. ఈ చిత్రంలో కంగనా నగ్నంగా నటించిందనీ, ఇందుకోసం ఆమె భారీగా పారితోషికాన్ని అందుకుంటోందనీ బాలీవుడ్ మీడియా పుకారు పుట్టించింది. ఇది వేగంగానే అన్ని 'వుడ్'లకూ పాకింది. హైద్రాబాద్ లో నెలరోజుల షూటింగ్ షెడ్యూల్ నుంచి ముంబై తిరిగి వచ్చిన కంగనాకు ఈ వదంతులు చేరడంతో ఆమె అగ్గిమీద గుగ్గిలమవుతోంది.
'సెన్సార్ కోడ్ ఏమిటనేది నాకు బాగా తెలుసు. నా జీవితంలో ఎప్పుడూ న్యూడ్ గా ఫోజివ్వడానికి ఇష్టపడను. బ్లాంక్ చెక్ ఇచ్చినా సరే' అంటూ కంగన చెప్పుకొచ్చింది. 'ఏక్ నిరంజన్' సినిమా షూటింగ్ జరుగుతుండగా పూరీ జగన్నాథ్ ను జర్నిలిస్టులు కలుసుకున్నారనీ, కంగనా న్యూడ్ గా నటించిందంటూ వచ్చిన వదంతులు విని ఆయన దిగ్భ్రాంతికి గురయ్యారనీ, తెలుగు సినిమా గ్రేట్ డైరెక్టర్లరో ఆయన కూడా ఒకరనీ కంగన తెలిపింది. ఎవరో కావాలని ఇలాంటి పుకార్లు పుట్టించి ఉండవచ్చనీ, సినిమాలో ఎలాంటి న్యూడ్ సన్నివేశాలు లేవని ఆమె తేల్చిచెప్పారు. తాను నటించిన హిందీ 'రాజ్' చిత్రంలోనూ నగ్నంగా నటించానంటూ అప్పట్లో ప్రచారం చేశారనీ, నిజానికి అలాంటిదేమీ లేదని కూడా ఆమె వివరణ ఇచ్చిది. అందులో బాడీ సూట్ తో చేసిన సన్నివేశాన్ని పట్టుకుని న్యూడ్ సీన్ అన్ని ప్రచారం చేయడం తగదన్నారు. ఎక్స్ పోజింగ్ చేయడం హీరోయిన్లకు అవసరమే అయినా అది కూడా కళాత్మకంగా ఉండాలనీ, నిలువెత్తు డబ్బు ఇచ్చినా, తుపాకీ చూపించి నటించమన్నా ససేమిరా అనేస్తాననీ వివరణ ఇచ్చింది. అన్నట్టు 'ఏక్ నిరంజన్' లో కంగన గిటార్ టీచర్ గా నటిస్తోంది.
News Posted: 6 May, 2009
|