కేన్స్ కు అక్షయ్, కరీనా
'కంబఖ్త్ ఇష్క్' జంట అక్షయ్ కుమార్, కరీనా కపూర్ కేన్స్ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ ఆహ్వానం లభించింది. ఈ ఇద్దరూ హాలీవుడ్ స్టార్ స్విల్వస్టర్ స్టాలోన్ తో కలిసి ఇందులో పాలుపంచుకోనున్నారు. నెల 13 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభమవుతుంది. ఆసక్తికరంగా 'కంబఖ్త్ ్ ఇష్క్' చిత్రంలో సిల్వస్ట్ర స్టాలోన్ గెస్ట్ పాత్ర పోషించారు. త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.
'కంబక్త్ ఇష్క్' సినిమా రిలీజ్ గురించి నిర్మాత సాజిద్ నడియడ్ వాలాను స్టాలోన్ వాకబు చేశారనీ, అక్షయ్, కరీనాల పట్ల తనకున్న అభిమానాన్ని తెలయజేయడంతో సాజిద్ సైతం కేన్స్ ప్లాన్ ను ఆయన ముందుంచారనీ అంటున్నారు. కేన్స్ కు రెడ్ కార్పెట్ ఆహ్వానంపై అక్షయ్ ను సంప్రదించినప్పుడు....స్టాలోన్ తో కలిసి కేన్స్ లో పాల్గొనే అవకాశం చాలా ఎగ్జయిటింగ్ కలిగించే అంశమనీ, తొలినాళ్లలో తాను బ్యాంకాక్ లో ఉన్నప్పుడు తన రూమ్ లో శ్రీదేవి, బ్రూస్ లీ, సిల్వస్టర్ స్టోలోనే పోస్టర్లు ఉండేవనీ చెప్పారు. న్యూయార్క్ లో ఉన్న కరీనా సైతం తన సంబరాన్ని వ్యక్తం చేస్తూ, స్టాలోన్ తో కలిసి రెడ్ కార్పెట్ పై నడవడం లవ్లీగా ఉంటుందనీ, బహు కొద్ది మందికే ఇలాంటి అరుదైన అవకాశం దొరుకుతుందనీ ఆమె వ్యాఖ్యానించారు. 'కంబఖ్త్ ఇష్క్ ' లో స్టాలోన్ తో పటు బ్రాండన్ రూత్, డెనీస్ రిచర్డ్స్ వంటి హాలీవుడ్ దిగ్గజాలు సైతం అతిథి పాత్రలు పోషించడం విశేషం.
News Posted: 7 May, 2009
|