రెహ్మాన్ 'జయహో' హిట్
'స్లమ్ డాగ్ మిలయనీర్' చిత్రంతో ఆస్కార్ విజేతగా నిలిచిన సంగీత దిగ్గజం ఎ.ఆర్.రెహ్మాన్ 'వరల్డ్ టూర్ కన్సర్ట్స్ 'లో భాగంగా కేరళలో వేసిన తొలి అడుగు గ్రాండ్ సక్సెస్ అయింది. 'జై హో' షో ద్వారా 7 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చిందనీ, రెహ్మాన్ కు 1.5 కోట్లు పారితోషికం లభించిందనీ పార్లమెంటు సభ్యుడు, కేరళీయం (కేరల ఎన్జీఓ సంస్థ) పి.వి.అబ్దుల్ వహాబ్ తెలిపారు. వరల్ట్ టూర్ లో భాగంగా మొత్తం 39 షోలు జరుగుతాయనీ, తదుపరి మ్యూజిక్ కన్సర్ట్ అబూదబిలో ఉంటుందనీ చెప్పారు.
కేరళ మ్యూజిక్ షో ద్వారా వచ్చిన మొత్తాన్ని హెచ్ఐవి బాధిత పిల్లల పునరావాసానికి ఖర్చు చేయబోతున్నారు. హెచ్ఐవి పాజిటివ్ ఉన్న 450 మంజి పిల్లలకు రూ.15.000 ఆర్థిక సహాయం అందజేస్తారు. కనర్ట్ ద్వారా వచ్చిన ఆదాయం నుంచి సుమారు 1000 మంది పిల్లలకు ప్రయోజనం చేకూరుతుందని వహాబ్ తెలిపారు. హెచ్ఐవి బాధితులైన పిల్లల పునరావాసం కోసం తన రెమ్యునరేషన్ నుంచి కూడా ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని రెహ్మాన్ సైతం ఇటవల ప్రకటించారు.
News Posted: 7 May, 2009
|