'రణ్' గీతంపై సుప్రీంకు వర్మ
రామ్ గోపాల్ వర్మ తన తాజా చిత్రం 'రణ్'లో టైటిల్ ట్రాక్ కోసం జాతీయ గీతమైన 'జన గణ మన అధినాయక జయహే' గీతాన్ని 'జన గణ మన రణ్ హై' అంటూ రీమిక్స్ చేసి పాడించడంపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేయడంతో తదుపరి చర్యకు ఆయన సిద్ధపడుతున్నారు. ఈ పాటకు సంబంధించిన ఫిల్మ్ ప్రమోను సెన్సార్ బోర్డు ఇటీవల సమీక్షించి చట్టంలోని పలు నిబంధనల ప్రకారం ఈ పాటకు అనుమతి నిరాకరిస్తున్నట్టు తేల్చిచెప్పింది. ప్రమోషన్ వర్క్ లో భాగంగా ఈ పాటను టెలికాస్ట్ చేసేందుకు అనుమంచేది లేదని స్పష్టం చేసింది. అయితే వర్మ తనదైన స్టయిల్ లో క్షమాపణ చెప్పడం కానీ, నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం గానీ చేయబోవడం లేదు. సెన్సార్ బోర్డు రూలింగ్ పై హైకోర్టును ఆశ్రయించాలని వర్మ, నిర్మాతలు మధు మంతెన, శీతల్ తల్వార్ తొలుత భావించారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ లో కొద్ది మార్పు చోటు చేసుకుంది, భావ ప్రకటనా స్వేచ్ఛపై తమకున్న హక్కులను పరిరక్షించుకునేందుకు సుప్రీంకోర్టులోనే సవాలు చేయాలని నిశ్చయించారు.
దీనిపై మధు మంతెన వివరణ ఇస్తూ, హైకోర్టుకు వెళ్లాలని మొదట్లో అనుకున్నప్పటికీ కేసు తమకు అనుకూలంగా ఉందని లాయర్లు భావించడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామనీ చెప్పారు. సినిమాలోనూ, ప్రమోషన్స్ లోనూ 'జన గణ మన రణ్ హై'పాటను వినియోగించకుండా సెన్సార్ బోర్డు తమను నిరోధించిందని చెప్పారు. అయితే వారు సూచించిన నిబంధన కేవలం నేషనల్ ఎంబ్లమ్స్, సింబల్స్ కు మాత్రమే వర్తిస్తుందనీ, జాతీయ గీతానికి కాదనీ ఆయన అన్నారు. జాతీయగీతాన్ని పాడకుండా ఎవర్నీ నిరోధించడరాదనే నిబంధన ఉన్నప్పటికీ అది తమ పాటకు వర్తించదని భావిస్తున్నట్టు చెప్పారు.
News Posted: 14 May, 2009
|