బార్బరాతో హృతిక్ 'లిపికిస్'
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ మరోసారి 'లిప్ లాక్' సీన్ లో నటించారు. 'ధూమ్-2', 'జోథా అక్బర్' చిత్రాల్లో ఐశ్వర్యారాయ్ అధరాల చుంబనతో సంచనలం సృష్టించిన హృతిక్ ఈసారి లాటిన్ సుందరి బార్బరా మోరితో లిపి కిస్ సన్నివేశంలో జీవించారు. నిజజీవితంలో దంపతులు ఎలా ముద్దుపెట్టుకుంటారో అంత సహజంగా ఈ ముద్దు సన్నివేశం ఉంటుందనీ, తనలోని బిడియాన్ని పోగొట్టి అత్యంత సహజంగా ఈ సన్నివేశం రావడానికి మోరీ ఎంతగానో సహకరించిందనీ హృతిక్ సంబరంగా చెప్పుకొచ్చారు. హృతిక్-బార్బరా మోరి జంటగా నటించిన 'కైట్స్' చిత్రంలో ఈ లిపికిస్ సీన్ చోటుచేసుకుంది.
'లిపి కిస్' సన్నివేశంపై హృతిక్ మరింత స్పందిస్తూ 'ముద్దు గురించి మనం తరచు ఎందుకు ముచ్చటించుకుంటున్నాం? అదంత పెద్ద వ్యవహారమా? మన సినిమా ఆ స్థాయికి పెరగలేదా? అవును...ఈ సినిమాలో ముద్దు సన్నివేశాలు ఉన్నాయి. అవన్నీ చాలా బాగా వచ్చాయి. సినిమా రిలీజ్ అయ్యాక నా భార్య, కుమారుడు, తల్లిదండ్రులతో కలిసి ఎలాంటి ఇబ్బందిలేకుండా సినిమా చూస్తాను' అని నవ్వుతూ సమాధానమిచ్చారు. 'కైట్స్' ఒక ప్రేమకథా చిత్రమనీ, సహజంగా ఎవరైనా ప్రేమలో పడినప్పుడు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించేందుకు ఇష్టపడతారనీ అన్నారు. ప్రేమను అత్యంత సహజంగా తెరపై ప్రదర్శిచేందుకు నటీనటులు ఎంత బిడియపడతారనే విషయంపై బార్బరా మోరీ తనకు అవగాహన కల్పించిందని ప్రశసించారు. అమెరికాలోని న్యూ మెక్సికోలో ఓ ప్రమాదకరమైన యాక్షన్ సన్నివేశానికి ముందు హృతిక్-బార్బరలపై ఈ ముద్దు సన్నివేశాన్ని దర్శకుడు చిత్రీకరించారట. 'చాలా ఎత్తులో ఉన్న ఓ భవంతి నుంచి మేమిద్దరం దూకాల్సిన సన్నివేశం అది. ఆ సీన్ కు ముందు బార్బరాకు ముద్దివ్వమని దర్శకుడు అనురాగ్ బసు చెప్పారు. ఆమె బగ్గపై ముద్దిచ్చాను. బార్బరా నావైపు తిరిగి బుగ్గమీద ఎందుకు ముద్దు పెట్టావు అని అడిగింది. నిజజీవితంలో నీ భార్య సుజానేకి ఇలాగే కిస్ ఇస్తావా అని ప్రశ్నించింది. ఆమె లాజిక్ నన్నెంతగానో ఆకట్టుకుంది. మళ్లీ మరో టేక్ అనుకున్నాం. ఈసారి మాత్రం నిజజీవితంలో దంపతులు ఎలా రియాక్ట్ అవుతారో అలాగే ఆమెను గట్టిగా ముద్దుపెట్టుకున్నాను. బుగ్గ మీద కాదులెండి...పెదాలపైనే...' అని హృతిక్ కొసమెరుపు ఇచ్చాడు. మరి సుజానే రియాక్షన్ ఎలా ఉంటుందంటారు?!
News Posted: 16 May, 2009
|