అక్షయ్ అరెస్టు...బెయిలు
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను సోమవారంనాడు ముంబై పోలీసులు అరెస్టు చేసి బెయిలుపై విడుదల చేశారు. ఏప్రిల్ లో జరిగిన లక్మే ఇండియా ఫ్యాషన్ వీక్ లో అక్షయ్ కుమార్ తన ఫ్యాంట్ జిప్ ను భార్య ట్వింకిల్ కన్నా చేత విప్పించడం సంచలనం సృష్టించింది. పబ్లిక్ లో 'అశ్లీల' ప్రవర్తనకు పాల్పడ్డారంటూ అక్షయ్ దంపతులపైన, నిర్వాహకులపైన అనిల్ నాయిర్ అనే వ్యక్తి కేసు పెట్టారు.
అక్షయ్ కుమార్ ను సోమవారం ఉదయం 8.30 గంటలకు అరెస్టు చేసి ఆ తర్వాత బెయిలుపై విడుదల చేసినట్టు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ మహాదడి తెలిపారు. గత నెల రోజులుగా విదేశాల్లో ఉన్న అక్షయ్ ఆదివారం రాత్రి ముంబై చేరుకున్నారు. ఆయన తన లాయర్ తో కలిసి వకోలా పోలీస్ స్టేషన్ లో లొంగిపాయారు. ఆయన వెంట లాయర్ కూడా ఉన్నారనీ, భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 294 కింద ఆయనపై మోపిన అభియోగం బెయిల్ కు అర్హమని అరవింద్ తెలిపారు. ఇదే కేసులో ట్వింకిల్ ఖన్నా సైతం ఇటీవల పోలీసులకు లొంగిపోయి బెయిల్ మీద విడుదలయ్యారు.
News Posted: 18 May, 2009
|