గోవిందా కుమార్తె తెరంగేట్రం
విలక్షణ నటుడు కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ 'లక్' చిత్రంతో బాలీవుడ్ కు అడుగుపెడుతుండగా, ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా కుమార్తె నర్మదా అహుజా సైతం తండ్రిబాటలోనే గ్లామర్ వరల్డ్ లోకి అడుగుపెడుతోంది. ఏడాది క్రితం 'ఇఫా' అవార్డ్ ఫంక్షన్ లో నర్మద తళుక్కుమని మెరిసింది. నర్మద త్వరలోనో హీరోయిన్ గా బాలీవుడ్ లో అడుగుపెడుతున్నట్టు అప్పటి నుంచి ఊహాగానాలు వినిపిస్తూ వచ్చాయి. ఎట్టకేలకు ఆ ఊహాగానాలకు తెరపడింది. ఓ ప్రముఖ నిర్మాత చిత్రం ద్వారా నర్మద బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది. త్వరలోనే ఆ వివారాలను అధికారికంగా సదరు నిర్మాణ సంస్థ ప్రకటించనుంది.
నర్మద మంచి అందగత్తె కావడమే గాకుండా నటన పట్ల ఎంతో ఆసక్తి ఉందనీ, ఇండియన్ ట్రెడిషన్ గాళ్ గానే కాకుండా వెస్ట్రన్ లుక్ లోనూ ఆమె అందర్నీ ఆకట్టుకోవడం ఖాయమనీ చెబుతున్నారు. దీనికితోడు నర్మద పేరులో మరింత బలం చేకూరేందుకు ఆంగ్లంలో రెండు అక్షరాలను కూడా జోడించిన న్యూమరాజలిస్ట్ నీరజ్ మాన్ చంద సైతం నర్మద సినీ కెరీర్ కు తిరుగుండదని భరోసా ఇస్తున్నారు. 'కొద్దిరోజులు ఓపిక పట్టండి...ఆగస్టు నుంచి నర్మద దశ తిరిగిపోతుంది. ఇక ఆఫర్ల వెల్లువే..' అని నీరజ్ చెబుతున్నారు. న్యూమరాలజీ మ్యాజిక్ గోవింద కూతురికి ఎలాంటి స్టార్ డమ్ తెచ్చిపెడుతుందో చూడాలి.
News Posted: 20 May, 2009
|