నీతూ లెస్బియన్ ఫోజులు
'వివాదాల రాణి'గా పేరు తెచ్చుకునేందుకు నీతూచంద్ర ఎంతమాత్రం వెనుదీయడం లేదు. శేఖర్ కమ్ముల 'గోదావరి' చిత్రంలో సుమంత్ మరదలిగా నటించిన అమ్మాయే నీతూచంద్ర. 'సత్యమేవ జయతే' చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్ర కథానాయకుడు డాక్టర్ రాజశేఖర్ తనను వేధించారనీ, చేయి కూడా చేసుకున్నారనీ ఆ మధ్య బాలీవుడ్ పత్రికలకెక్కి సంచనలం రేపింది. ఆ సంఘటనతో తనకు వచ్చిన పబ్లిసిటీ చాలనుకుందేమో ఏమో గానీ మళ్లీ ఆ ప్రసావనే లేదు. ఇప్పుడు ఓ పురుషుల మ్యాగజైన్ కోసం ఆమె పచ్చిగా శృంగార భంగిమల్లో ఫోటో షూట్ చేసింది. ఇందులో మరో మోడల్ తో కలిసి ఆమె 'లెబ్సియన్ యాక్ట్' కు పాల్పడింది.
పురుషుల మ్యాగజైన్ 'ది మ్యాన్' కోసం ఈమధ్యనే ముంబైలోని ఓ త్రీ-స్టార్ హోటల్ లో ఫోటో షూట్ జరిగింది. బహిరంగ ప్రదేశంలోనే ఈ ఫోటో షూట్ జరగడం అక్కడి కస్టమర్స్ దృష్టిలో పడటంతో వారు ఒక్కసారిగా భగ్గుమన్నారు. లెస్బియనిజమ్ ను ప్రోత్సిహించేలా ఈ ఫోటో షూట్ ఉందంటూ వారు యూనిట్ సభ్యులపై తిరగబడ్డారు. కొందరైతే సిబ్బందిని కొట్టడానికి కూడా సిద్ధపడటంతో ఆ ఫోటో షూట్ కు యూనిట్ ప్యాకప్ చెప్పాల్సి వచ్చింది. ఇక్కడితో కథ ముగిసిపోలేదు. సంచనలం రేకెత్తించిన ఈ ఫోటో షూట్ ను వేరేచోట కొనసాగించడంతో పాటు ఈ ఫోటోలను తదుపరి ఇష్యూలో కవర్ పేజీ కథనంగా ముద్రించడం ద్వారా స్టాండ్స్ లోకి తీసుకురానుంది. దీనిపై నీతూ స్పందిస్తూ 'మరో అమ్మాయితో రెచ్చగొట్టే భంగిమలో ఫోజివ్వడం తప్పని నేను అనుకోను. అయినా కళాత్మకంగానే వీటి చిత్రీకరణ జరిగింది. అసలు కాన్సెప్ట్ ఏమిటనేది పట్టించుకోకుండా న్యూడిటీ అంటూ గొడవ చేయడమే ఈ మగాళ్లకి అలవాటైంది' అంటూ రుసరుసలాడింది. లెబ్సియన్ మ్యాగజైన్లు కూడా జనంలోకి దూసుకువస్తున్న తరుణంలో నీతూ వాదన నిలబడుతుందా, సంప్రదాయాల వాదుల కన్నెర్ర చవిచూస్తుందా అనేది వేచిచూడాల్సిందే.
News Posted: 22 May, 2009
|