'కపుల్స్ రిట్రీట్'లో రెహ్మాన్
'ది స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రానికి రెండు ఆస్కార్ లు అందుకున్న ఎ.ఆర్.రెహ్మాన్ త్వరలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ ను అంగీకరించబోతున్నారంటూ కొద్దిరోజులుగా వినిపిస్తూ వచ్చింది. హాలీవుడ్ దిగ్గజాలతో పనిచేసేందుకు చర్చలు జరుగుతున్నాయంటూ రెహ్మాన్ సైతం ఇటీవల చెప్పుకొచ్చారు. ఎట్టకేలకు రెహ్మాన్ హాలీవుడ్ ప్రాజెక్ట్ ఖరారైంది. యూనివర్శల్ స్టూడియోస్ నిర్మించనున్న తదుపరి చిత్రానికి రెహ్మాన్ తో అగ్రిమెంట్ కుదిరింది. 'కపుల్స్ రిట్రీట్' పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి పీటర్ పెలెన్ స్కీ దర్శకత్వం వహించనున్నారు.
రొమాంటిక్ కామెడీగా రూపొందన్న ఈ చిత్రంలో విన్సె వాగెన్, క్రిస్టీన్ బెల్, జానస్ బటెమాన్ తదితరులు నటించనున్నారు. రెహ్మాన్ ఈ చిత్రానికి మెలోడియస్ ట్యూన్స్ అందించబోతున్నారనీ, అతి త్వరలోనే సెట్స్ పైకి రానున్న ఈ చిత్రం ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు యూనివర్శల్ స్టూడియోస్ ప్లాన్ చేస్తోందనీ సినీ వర్గాల ద్వారా తెలిసింది.
News Posted: 22 May, 2009
|