జోహాన్స్ బర్గ్ లో కత్రినా 'జైహో'
దక్షిణాఫ్రికాలోని వాండెరర్స్ స్టేడియంలో ఆదివారంనాడు అత్యంత ఉత్కంఠ భరితంగా జరుగనున్న ఐపిఎల్ ఫైన్స్ కు మీరు రెడీనా? నిర్వహకులు మాత్రం స్వర్వసన్నాహాలతో, వరుస ప్రోగ్రామ్స్ తో ఊర్రూతలూగించబోతున్నారు. బాలీవుడ్ హాటీ కత్రినా కైఫ్ తన డాన్స్ లతో ఇటు ఆడియెన్స్ నూ, అటు బరిలో తలపడుతున్న టీమ్ లనూ ఉత్సాహపరచేందుకు రెడీ అవుతోంది. ఎ.ఆర్.రెహ్మాన్ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ 'జై హో'కు ఆమె పెర్ ఫారమెన్స్ ఇవ్వబోతుండటం విశేషం. ఆమెతో పాటు ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగుని రీతిలో వినోదం అందించేందుకు బ్రిటీష్ రెగ్గీ సింగ్ ఎడ్రీ గ్రాంట్, తన గాత్రంతో లక్షలాది మంది మనసులు దోచుకున్న అమెరికన్ ఆర్ అండ్ బి ఆర్టిస్ట్ అకాన్ తదితరులు కూడా సిద్ధపడుతున్నారు.
'లక్షలాది మంది ప్రజల మధ్య ప్రదర్శన ఇవ్వడమంటే అనిర్వచనీయమైన అనుభూతిని సొంతం చేసుకోవడమే అవుతుంది. ఇది అందరి డ్రీమ్ కూడా. కోట్లాది మంది టెలివిజన్ లో తిలకించే అపూర్వ ఘట్టమిది. ఎవరికి మాత్రం ఎగ్జయిమెంట్ ఉండదు చెప్పండి' అంటూ గురువారంనాడు జోహాన్స్ బర్గ్ కు బయలు దేరేముందు కత్రినా తన సంబరాన్ని వ్యక్తం చేసింది. గత కొద్దిరోజులుగా అక్షయ్ హీరోగా నటిస్తున్న 'దే దనా దన్' చిత్రం కోసం ఔట్ డోర్ షూటింగ్ లో పాల్గొంటున్న కత్రినాకు ముంబై చేరినప్పటి నుంచి క్షణం కూడా తీరికలేకుండా ఐపిఎల్ ఫైనల్ రిహాల్సర్ లో పాల్గొని అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ప్రొఫెషనలిజం అంటే అదే మరి...
News Posted: 22 May, 2009
|