క్లాడియాతో సల్మాన్ 'బంధం'
జర్మన్ సూపర్ మోడల్, హాలీవుడ్ నటి క్లాడియా సీస్లాను తన 'స్పెషల్ ఫ్రెండ్'గా బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అభివర్ణించారు. క్లాడియాతో తన ఫ్రెండ్ షిప్ ను అంగీకరించడంతో పాటు ఆమెను తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశానని సల్మాన్ పేర్కొన్నట్టు కోల్ కతాకు చెందిన ఓ జాతీయ పత్రిక తాజా వార్త ప్రచురించింది.
క్లాడియా ఎప్పుడూ తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేయడానికి ఇష్టపడరనీ, మీడియా ముందు ఒక్కమాట కూడా మాట్లాడకుండా తన తరఫు ప్రతినిధికి కూడా ఆమె స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారనీ అంటారు. అయితే ఇప్పుడు క్లాడియాతో తనకున్న అనుబంధాన్ని కోల్ కతా మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సల్మాన్ బహిర్గతం చేశారు. క్లాడియాను తన ఇంటికి ఆహ్వానించడంతో పాటు తన కుటుబ సభ్యులకు కూడా పరిచయం చేసినట్టు సల్మాన్ ఆ పత్రికకు తెలిపారు. క్లాడియాతో ఆయనకున్న అనుబంధం గురించి ప్రశ్నించినప్పుడు 'క్లాడియా చాలా మంచి అమ్మాయి. ఆమెను నా కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాను' అని సల్మాన్ తెలిపారు. దీనిపై జర్మనీలో ఉన్న క్లాడియాను వివరణ కోరినప్పుడు 'సల్మాన్ కుటుంబ సభ్యులను ఈమధ్యనే కలుసుకున్నాను. సల్మాన్ సోదరుల, చెల్లెలు, ఆయన డార్లింగ్, ఎంతో హ్యాండ్ సమ్ గా కనిపించే సల్మాన్ తండ్రి సలీమ్...ఇలా అందరూ ఎంతో ఆప్యాయాతానురాగాలు కనబరచారు. అదో వండ్రఫుల్ ఫ్యామిలీ' అంటూ చెప్పుకొచ్చింది. సల్మాన్ మనసు బంగారమనీ, బాలీవుడ్ లో చాలమంది చాలామంది హీరోలు, డైరెక్టర్లు ఇతరులతో తమకున్న ఫ్రెండ్ షిప్ ను బయటపెట్టేందుకు భయపడుతుంటారనీ, సల్మాన్ ఇందుకు భిన్నమైన వ్యక్తి అనీ, ఎవరికీ భయపడని సాహస అనీ అభివర్ణించింది. 'నా హీరో సల్మానే' అని కితాబిచ్చింది. జూన్ లో ముంబైలో జరుగనున్న 'లివింగ్ టాలెంట్ ఫేస్ ఆఫ్ ఇండియా' ఫ్యాషన్ షోలో పాల్గొనబోతున్నాననీ, ముంబై వీధిపిల్లల సహాయార్థం జరుగనున్నఛారిటీ ఈవెంట్ లోనూ రాంప్ వాక్ చేయబోతున్నాననీ క్లాడియా తెలిపింది. 'భారతీయ సంస్కృతి, కట్టుబాట్లు, సంప్రదాయాలంటే నాకెంతో ఇష్టం. అన్ని మతాలపైనా నాకు గౌరవం ఉంది. భగవంతుడు ముందుగానే నిశ్చయించి ఉంటే ఇండియాలో పెర్మనెంట్ గా స్థిరపడాలని ఉంది' అని క్లాడియా కోలకతాకు చెందిన ఓ జర్నలిస్టుకు ఇచ్చిన ఇ-మెయిల్ లో వ్యాఖ్యానించింది. అంతా బాగానే ఉన్నా...సల్మాన్ 'స్పెషల్ ఫ్రెండ్' గురించి కత్రినా ఏమంటుందో ?!
News Posted: 23 May, 2009
|