'రణ్'లో లారాదత్తా ఐటెం
రామ్ గోపాల్ వర్మ తన 'రణ్' చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ చేయాలనే గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇందుకు దోహదం చేసే ఏ చిన్ని అంశాన్ని ఆయన విడిచిపెట్టడం లేదు. ఈ చిత్రంలో బిగ్ బి అమితాబ్ బచ్చన్, రితీష్ దేశ్ ముఖ్ అద్భుతమైన నటనను ప్రదర్శించారనే ప్రచారం ఇప్పటికే జరుగుతోంది. సంచలనాల నీతూచంద్ర ఇందులో డీ-గ్లామరైజ్డ్ రోలో పోషించినప్పటికీ ఈ చిత్రంతో తన కెరీర్ ఎక్కడికో వెళ్లిపోతుందన్న ధీమతో ఉంది. అయితే వర్మ సినిమాలంటే గ్లామర్ మోత మోగుతుందనే అభిప్రాయం ఉండనే ఉంది. మరి ఇందులో 'ఐటెం సాంగ్' మాటేమిటి? వర్మ ఈసారి కూడా వెనక్కి తగ్గడం లేదు.
'కంపెనీ'లో వర్మ ఖల్లాస్ ఐటెం నెంబర్ ను ఇంట్రడ్యూస్ చేశారు. ఆ పాట పెద్ద హిట్టవడంతో పాటు ఖల్లాస్ గాళ్ గా ఇషా కొప్పికర్ పేరు మారుమోగిపోయింది. ఆ దృష్టితోనే ఇటీవల వర్మ మరోసారి ఆమెను అప్రోచ్ అయ్యారట. అయితే ఆ ఆఫర్ ను ఇషా తోసిపుచ్చింది. ఇషా ఐటెం సాంగ్ లో నటించడం ఆమె బాయ్ ఫ్రెండ్ టిమ్మీ నారంగ్ కు ఇష్టం లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు ఇషా ప్లేస్ లో లారాదత్తా వచ్చిచేరిందనీ, ఈ సాంగ్ మరో 'ఖల్లాస్' సాంగ్ లా సంచలనం సృష్టించబోతోందనీ అంటున్నారు. ఆమధ్య మ్యాగ్జిమ్ కవర్ స్టోరీకి ఎక్కిన లారాకు వర్మ పెద్దమొత్తంలోనే రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్టు చెబుతున్నారు.
News Posted: 25 May, 2009
|