ముంబైలో ఓ ఇంటిదైన ఆసిన్
ఆసిన్ తొట్టుంకల్ ఎట్టకేలకు రెండేళ్ల తన కలను సాకారం చేసుకుంది. ఇంతవరకూ తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న లొఖండ్వాలా అపార్ట్ మెంట్ నుంచి అదే ఏరియాలోని గ్రీన్ యాకర్స్ లోని తన సొంతింటికి ఆసిన్ ఈమద్యనే షిఫ్ట్ అయింది. ఆమె సొంత రాష్ట్రం కేరళ అయినా ప్రస్తుతం ముంబైలోనే ఎక్కువ సమయం గడుపుతోంది. 'గజనీ' చిత్రంతో బాలీవుడ్ లో కాలుపెట్టి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వెంటనే ముంబైకి శాశ్వతంగా షిఫ్ట్ కావాలని ఆసిన్ అనుకుంటూ వచ్చింది. 'గజనీ' అనంతరం హిందీలోనూ ఆసిన్ ఒక్కసారిగా బిజీ అయింది. 'లండన్ డ్రీమ్', '19 స్టెప్స్' వంటి పలు చిత్రాలు ప్రస్తుతం ఆసిన్ చేతిలో ఉన్నాయి.
ఆసిన్ 2007 నుంచి ముంబైలో తన కలల సౌధం కోసం అన్వేషిస్తోందనీ, తన తల్లిదండ్రుల నుంచి ఇండిపెండెంటెంగా తన సొంతింట్లోకి వెళ్లాలనే కోరిక ఇప్పటికి తీరిందనీ ఆసిన్ సన్నిహతురాలు ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఆ ఇంటిని తన అభిరుచికి అనుగుణంగా డిజైన్ చేయించుకునే పనుల్లో ఆసిన్ ఉందనీ, తక్కువ ఫర్నిచర్ తో అత్యంత ఆధునికమైన ఇంటీరియర్ డిజైన్ ను ఆసిన్ ఇష్టపడుతోందనీ ఆమె తెలిపారు. సొంత ఇంటి సమస్య తీరడంతో ఆసిన్ సైతం ఎంతో ఉత్సాహంగా కనిపిస్తోంది. చాలాకాలంగా సొంతిల్లు కోసం ఎదురుచూస్తున్నాననీ, వరుస షూటింగ్ షెడ్యూల్స్, ప్రయాణాల వల్ల బిజీగా ఉండటంతో వెంటనే అది సాధ్యం కాలేదనీ, ఎట్టకేలకు తన కల తీరడం హ్యాపీగా ఉందనీ చెప్పుకొచ్చింది. అన్నట్టు...శ్రీదేవి, టబూ సైతం ఇదే ఏరియాలో నివాసముంటున్నారు.
News Posted: 26 May, 2009
|