టైటానిక్ స్టార్ తో బిపాసా
బాలీవుడ్ సంచలన నటి బిపాసా బసు ఇప్పుడు తొలిసారిగా హాలీవుడ్ లో కాలుపెడుతోంది. 'టైటానిక్' స్టార్ బెల్లి జనేతో కలిసి బిపాసా నటించనుండటం విశేషం. 'చిమెరా' పేరుతో రూపొందనున్న ఈ చిత్రానికి డేనియల్ సిల్వర్ మాన్, తపన్ తసా దర్శకత్వం వహించనున్నారు. జూలైలో ఈ చిత్రం సెట్స్ పైకి రానుంది. ఇందుకోసం బెల్లీ జనే డేట్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. ఇందులో బిపాసా బసు తండ్రిగా విక్టర్ బెనర్జీ నటించనున్నారు.
'చెమెరా' ఓ థ్రిల్లర్ చిత్రమనీ, అమెరికన్ డాక్టర్ గా బెల్లీ జనే నటించనున్నారనీ తపన్ తెలిపారు. భారత్ లో పనిచేసే అవకాశం రావడంతో ఈ డాక్టర్ ఇండియా వస్తాడనీ, అక్కడే అతని వద్ద ట్రీట్ మెంట్ కోసం వచ్చిన బిపాసాను కలుసుకుంటారనీ కథాక్రమాన్ని చెప్పుకొచ్చారు. బిపాసా తల్లి పాత్రలో నటించాల్సిందిగా షబానా అజ్మీని సంప్రదించామనీ, బిల్లీ ఇండియన్ ఫ్రెండ్ గా అనిల్ కపూర్ ను అనుకుంటున్నామనీ చెప్పారు.
ఈ చిత్రంపై ఇప్పటికిప్పుడు మాట్లాడేందుకు బిపాసా సుముఖంగా లేదట. ఈ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడే చెప్పడం సబబు కాదనీ, సరైన సమయంలో బిపాసా రియాక్షన్ ఏమిటనేది తెలియజేస్తామనీ ఆమె మేనేజర్ తనుజా వి వర్మ వివరణ ఇచ్చారు. ఇందులో బిల్లీ, బిపాసా మధ్య లవ్ సీన్స్ ఇంతవరకూ ఇండియన్ సినిమా చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా ఉండబోతున్నాయట.
News Posted: 29 May, 2009
|