ఏంజెలినాను తలదన్నే దీపిక
అందానికే కొత్త అర్థాలు చెప్పగలిగిన హాలీవుడ్ సోయగాల సుందరి ఏంజెలినా జోలి కంటే మన బాలీవుడ్ సుందరి దీపక పడుకునే అందంలో ఓ మెట్టు పైన ఉందట. 'ఏంజలినాను తలదన్నే అందం దీపికది' అంటూ పాపులర్ డైరెక్టర్ రాబ్ కోహెన్ అభివర్ణించినట్టు 'ఫిమేల్ ఫస్ట్' పేర్కొంది. బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ కు జోడిగా 'ఓం శాంతి ఓం' చిత్రం ద్వారా దీపిక పరిచయమైంది.
'ది విచెస్ ఆఫ్ ఈస్ట్ విక్', 'ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్', 'డ్రాగన్ : ది బ్రూస్లీ స్టోరీ' వంటి ఎన్నో అత్యద్భుత చిత్రాలను రాబ్ కోహెన్ అందించారు. తన తదుపరి ప్రాజెక్ట్ లో ఇండియన్ బ్యూటీ దీపిక పడుకునే ను తీసుకోవాలనే ఆలోచన కూడా ఉందని కోహెన్ సూచనప్రాయంగా చెప్పినట్టు ఆ వెబ్ సైట్ పేర్కొంది. ప్రపంచ ఫ్యాషన్ రంగంలోనూ దీపిక ఇప్పుడు తనదైన ముద్రతో ప్రత్యేకతను సంతరించుకుంటోంది. 'మేబిలైన్', 'లెవీస్' వంటి ఇంటర్నేషనల్ బ్రాండ్ లు ఆమె చేతిలో ఉన్నాయి. 'యాహూ' సెర్చింగ్ లో 2008 సంవత్సరానికి ఐశ్వర్య, శిల్సాశెట్టిని కూడా తోసిరాజని టాప్ సెర్చ్ డ్ సెలబ్రెటీ స్టాటస్ ను కూడా దీపిక దక్కించుకుంది.
News Posted: 30 May, 2009
|