పెళ్లికి అమీషా రెడీ
'కహో నా ప్యార్ హై', 'గదర్: ఏక్ ప్రేమ్ కథా', 'భూల్ బులైయా' వంటి సక్సెస్ చిత్రాల్లో నటించిన అమీషా పటేల్ ఆమధ్య 'లేజీ లమ్హే' (తోడా ప్యార్ తోడా మ్యాజిక్) అనే ఐటెం సాంగ్ తో తన ఇమేజ్ కు కొత్త గ్లామర్ కూడా జోడించింది. వృత్తిపరంగా సంతృప్తిగా ఉన్నానంటున్న అమీషా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు కూడా డిక్లేర్ చేసింది. తన చిరకాల బాయ్ ఫ్రెండ్ కనవ్ నే ఆమె పెళ్లాడనుంది.
కనవ్ తో తన పరిచయం, అతనిలో తనకు నచ్చిన క్వాలిఫికేషన్ల గురించి అమీషా సంబరంగా చెబుతోంది. 'కనవ్ ది లండన్. హోటల్ బిజినెస్ పని మీద తరచు లండన్, ఢిల్లీ మధ్య ప్రయాణిస్తుంటాడు. అలా బిజినెస్ పని మీద వచ్చినప్పుడు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా నాకు పరిచయమయ్యాడు. ఇద్దరం కాఫీ తాగి కాసేపు కబుర్లాడుకున్నాం. ఆ తర్వాత ఏడెనిమిది నెలలకు నేను ఢిల్లీ వెళ్లినప్పుడు మరోసారి కలుసుకున్నాం. ఇక అప్పట్నించీ ఒకరికొకరు దగ్గరయ్యాం. టెలిఫోన్ నెంబర్లు మార్చుకున్నాం. ఆ తర్వాత మళ్లీ వెనక్కి చూసుకునే అవసరం రాలేదు' అని చెప్పుకొచ్చింది. ఫిజికల్ గా, భావోద్వాగాల పరంగా, వ్యక్తిగతంగా, సర్ ప్రైజ్ చేసే విషయంలో..ఇలా ఏరకంగా చూసినా కవన్ ఎంతో రొమాంటిక్ పర్సన్ అని కితాబిచ్చింది. తన పట్ల ఎంతో కేరింగ్ తీసుకుంటాడనీ, ఇద్దరి మధ్యా మంచి అవగాహన ఉందనీ తెలిపింది. మరి పెళ్లెప్పుడని అడిగితే 'అతి త్వరలోనే' అంటూ సిగ్గుమొగ్గలైంది.
News Posted: 1 June, 2009
|