పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ ఇక నుంచి మేకప్ వేసుకోరాదని నిశ్చయించుకుంది. తప్పనిసరైతే మేకప్ మరీ మందంగా కాకుండా చూసుకోవాలనే నిర్ణయం తీసుకుంది. భారీ మెకప్ వలన తన చర్మం దెబ్బతింటున్న విషయాన్ని కత్రినా ఆలస్యంగానైనా గుర్తించడమే ఈ నిర్ణయానికి కారణమని ఆమె సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. హేమీ మేకప్ వేసుకుని నిరంతరం ఆర్క్ లైట్స్ లో పనిచేయడం వల్ల ఆ లైట్స్ నుంచి వచ్చే వేడి చర్మాన్ని దెబ్బతీస్తోందని కత్రినా భావిస్తోంది.
మేకప్ కిట్ విసిరివేయాలనుకుంటున్న విషయంలో ఎంతమాత్రం అవాస్తవం లేదని కత్రినా తేల్చిచెప్పింది. 'ఇక నుంచి మేకప్ లేకుండా సహజంగానే కనిపించాలని అనుకుంటున్నాను. మేకప్ తో ఎప్పుడూ ఆర్క్ లైట్ల వేడిని చవిచూసే వాళ్ల చర్మం బాగా దెబ్బతింటుంది. అవసరమైన సందర్భాల్లో మినహాయిస్తే భారీ మేకప్ వేసుకునే వాళ్లంతా ఈ విషయంలో బాగా ఆలోచించాల్సి న అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ నేచురల్ గా కనిపించడం మంచిది' అంటూ తన తోటి హీరోయిన్లకు కూడా కత్రినా సలహాలిస్తోంది.