కరీనా..ఇంక తగ్గకు!
శరీర దారుఢ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకునే సల్మాన్, సైజ్ జీరో మోజులో పూచిక పుల్లలా కనిపిస్తున్న కరీనా కపూర్ కలిస్తే హ్యూమర్ పండదూ?! అందులోనూ సల్మాన్ లో హ్యూపర్ పాళ్లు ఎక్కువ. సల్మాన్ నిర్వహిస్తున్న '10 కా దమ్' టీవీ షో సెట్స్ లో ఇప్పుడు అలాంటి చమత్కారాలే చోటుచేసుకున్నాయి. ఒకప్పుడు చక్కటి ఆహార్యంతో బొద్దుగా ముద్దుగా కనిపించే కరీనా ఇటీవల బరువు కోల్పోతున్న తీరుపై సల్మాన్ తనదైన శైలిలో ఆలవోకగా సలహాలిచ్చేశారు. ఆమెతో పాటు మరో స్టార్ కంటెస్టెంట్ అయిన కరీనా అక్క కరిష్మా గురించి కూడా సల్మాన్ చమక్కులు విసిరారు.
'మరీ ఎక్కువ బరువు కోల్పోకుండా జాగ్రత్తపడు. మగవాళ్ల మాదిరిగానే ఆడవాళ్లు కూడా తగు మోతాదులో బరువు ఉండితీరాలి. ఆడవాళ్లు మరీ సన్నగా తయారైతే ముఖం పీక్కుపోతుంది. ఆకర్షణ కోల్పోతారు. ఫ్యాన్స్ కూడా గుర్తుపట్టలేని పరిస్థితి ఏర్పడుంది' అంటూ కరీనాకు సల్మాన్ హితబోధ చేశారు. సల్మాన్ సలహాలకు కరీనా ముసిముసి నవ్వులు చిందించింది. కరీనా అక్క కరిష్మా దాదాపు పెర్ ఫెక్ట్ ఫిగర్ తో ఉన్నట్టు సల్మాన్ కితాబిచ్చారు. సల్మాన్-కరిష్మా కలిసి నటించిన చాలా సినిమాలు ఫ్లాపు ముద్ర వేయించుకున్నవే. 'నాతో ఒక సినిమా ఆమె కెరీర్ ను మార్చేసింది...ఆమె చాలా పెద్ద స్టార్ అయిపోయింది' అంటూ సల్మాన్ మరోసారి నవ్వులపువ్వులు రువ్వారు.
News Posted: 1 June, 2009
|