సంజూతో మల్లిక రొమాన్స్
రాజకీయాలు, గాంధీగిరి తర్వాత హీరో సంజయ్ దత్ ఇప్పుడు హాటెస్ట్ గాళ్ మల్లికా షెరావత్ తో రొమాన్స్ చేయనున్నారు. మళ్లీ ఒకప్పటికి రొమాంటిక్ డేస్ లోకి వెళ్లబోతున్నారు. ఇదంతా స్క్రీన్ రొమాన్స్ అనేది అర్ధమయ్యే ఉంటుంది. 'గోల్ మాల్ రిటర్న్స్' వంటి హిలేరియస్ కామెడీ ఎంటర్ టైనర్ ను అందించిన రోహిత్ షెట్టి ఇప్పుడు 'ఆల్ ద బెస్ట్' అంటున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సంజయ్ కు జోడిగా మల్లికను ఎంపిక చేశారు. అజయ్ దేవగణ్ సొంత నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని రూపొందిస్తోంది. ఇందులో సంజయ్ తో పాటు అజయ్ దేవగణ్, ఫర్దీన్ ఖాన్, బిపాసా బసు, ముగ్దా గాడ్సే నటిస్తున్నారు.
సంజయ్ దత్ ప్రస్తుతం సోహమ్ షా 'లక్', ఆంథొని డిసౌజా 'బ్లూ' చిత్రంలో నటిస్తున్నారు. ఈ రెండిట్లోనూ ఆయనకు రొమాన్స్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయనకు జోడి అంటూ లేదు. ఇక దర్శకుడు రోహిత్ విషయానికి వస్తే మల్టీస్టారర్ చిత్రాలను హ్యాండిల్ చేయడంలో ఆయనకు ప్రత్యేకత ఉంది. ఇప్పుడు కూడా అదే ఉత్సాహంతో 'ఆల్ ద బెస్ట్' కు ఆయన అన్ని హంగులూ సమకూర్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో ఐటెం సాంగ్స్ కే పరమితమవుతున్న మల్లిక సైతం కథానాయికగా ఓ మంచి బ్రేక్ కోసం
ఎదురుచూస్తున్న తరుణంలో సంజయ్ కు జోడిగా నటించే అవకాశం రావడం, కామిక్ జనర్ సినిమా కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సంజయ్ లవర్ బాయ్ గా ఇందులో కనిపించబోతున్నారు. ఈ చిత్ర యూనిట్ త్వరలో షూటింగ్ కు దక్షిణాఫ్రికా బయలుదేరుతోంది. అక్కడ సంజయ్ దత్, మల్లికా షెరావత్ పై రెండు రొమాంటిక్ సాంగ్స్ చిత్రీకరించబోతున్నారు.
News Posted: 2 June, 2009
|