సల్మాన్ ఒళ్లో వాలిపోయింది..
ప్రేమికుల మధ్య అపోహలు, అపార్ధాలు తలెత్తడం, మళ్లీ కలిసిపోవడాలు అతి సహజం. ప్రేమికుల మధ్య అనుబంధాల విషయంలో బాలీవుడ్ లో వచ్చే గాసిప్స్ మోతాదు ఒకింత ఎక్కువే. ఈ తరహా వదంతులు రాగానే తమ పార్టనర్ల చెంత చేరి ఆ అపోహలు తొలగించే ప్రయత్నాలు ఇప్పుడు సదరు ప్రేమజంటలకు తప్పనిసరి అవుతోంది కూడా. సల్మాన్, కత్రినాకైఫ్ ల మధ్య ప్రేమాయణం అందరికీ తెలిసిందే. కత్రినా, జాన్ అబ్రహంల మధ్య ఏదో ఉందంటూ ఈమధ్య జనం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన తక్షణమే కైఫ్ నేరుగా సల్మాన్ ఒళ్లో వాలిపోయింది. జాన్ అబ్రహం సైతం తన ప్రియురాలు బిపాసా బసుతో గోపా వెళ్లి ఆమెతో ఏకాంత వాసానికి ప్లాన్ చేసుకుంటున్నారు. సహజంగా సల్మాన్ తో పబ్లిక్ లో అరుదుగా కనిపించే కత్రినా 'ఇద్దరం ఒకరికోసం మరొకరు పుట్టాం' అని బల్లగుద్ది చెప్పేందుకు గత ఆదివారంనాడు నేరుగా సల్మాన్ ను కలిసి ఐదు గంటల సేపు ఆయన్ని అంటిపెట్టుకునే ఉంది. ఫిల్మ్ సిటీలో జరుగుతున్న 'వాంటెడ్ డెడ్ ఆర్ అలైవ్' చిత్రం సెట్స్ లో సల్మాన్ ను కత్రినా కలుసుకుంది.
తెలుపు జీన్స్, గ్రీన్ టాప్ ధరించిన కత్రినా సాయంత్రం 4.30 గంటలకు సెట్స్ కు వచ్చిందనీ, రొటీన్ కు భిన్నంగా వ్యానిటీ వ్యాన్ లో కాకుండా సల్మాన్ వెంటే సెట్స్ లో కత్రినా కలియతిరగడం అందర్నీ ఆశ్చర్యపరచిందనీ యూనిట్ వర్గాల కథనం. ఆ తర్వాత బోనీకపూర్, వసు భగ్నాని, అర్జున్ కపూర్ లతో కొద్దిసేపు ముచ్చటించింది. రాత్రి 9.30 గంటల సమయంలో సల్మాన్ డిన్నర్ కు కంపెనీ కూడా ఇచ్చింది. మలేసియాలోని ఓ షాంపూ యాడ్ లో పాల్గొనవలసి ఉండటంతో సల్మాన్ నేరుగా ఆమెను తన కారులో ఎయిర్ పోర్ట్ కు తీసుకువెళ్లారు. 'సల్మాన్ కత్రినా అరమరికలు లేని విధంగా ఎంతో ఉల్లాసంగా కనిపించారు. కత్రినా ముఖంలో సల్మాన్ ను కలుసుకున్న ఆనందం తొణికిసలాడింది' అని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
News Posted: 3 June, 2009
|