కత్రినను టచ్ చేస్తే డేంజర్
కత్రినా కైఫ్ నిస్సందేహంగా మంచి అందగత్తె. సెక్సీదనం తొణికిసలాడుతుంటుంది. అయితే ఆమె పేరును నెట్ లో సెర్చ్ చేస్తే మాత్రం ప్రమాదం పొంచి ఉంది. ఈ మాట అంటున్నది మనం కాదు. 'ది వెబ్స్ మోస్ట్ డేంజరస్ సెర్చ్ టర్మ్స్' శీర్షికన మెకాఫీ సెక్యూరిటీ ప్రొవైడర్ ఈమేరకు హెచ్చరిస్తోంది. ఇండియాలోని ఆన్ లైన్ సెర్చ్ వర్డ్స్ లో కత్రినా కైప్ పేరు అత్యంత ప్రమాదకరమని తెలియజేసింది. ఇంటర్నెట్ లో బాగా సెర్చ్ చేస్తున్న సెలబ్రెటీస్ లో కత్రినా టాప్ ప్లేస్ లో ఉండటంతో ఆమె పేరుతో ముష్కరులు పలు వైరస్ లు వదులుతున్నారట.
కత్రినా పేరుతో సెర్చింగ్ కు వెళ్లినప్పుడు ఒక్కో పేజీలో డిస్ ప్లే అయ్యే లింక్స్ లో వెబ్ కారక లింక్స్ 28.6 శాతం వరకూ ఉంటున్నాయని ఆ సంస్థ ప్రకటించింది. హై రిస్క్ ఉన్న ఇండియన్ సెలబ్రెటీస్ పేర్లలో నమిత కూడా ఉందని తెలిపింది. సో...కత్రనా, నమిత పేర్ల మీద సెర్చింగ్ చేసే నెటిజన్స్ ఇకముందు జాగ్రత్త పడాల్సిందే.
News Posted: 3 June, 2009
|