'వోగ్' ముఖచిత్రంగా దీపిక
లండన్: బాలీవుడ్ అందాల సుందరి దీపిక పడుకునే అభిమానులందరికీ ఇది గ్రేట్ న్యూస్. లాటిన్ అమెరికాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ మ్యాగజైన్ 'వోగ్' కవర్ పేజీపై ఆమె చిత్రం అచ్చయింది. ఓ భారతీయ సుందరి ముఖ చిత్రాన్ని ఈ పత్రిక కవర్ పేజీపై ప్రచురించడం ఇదే మొదటిసారి. 'ఓం శాంతి ఓం' చిత్రంతో ఇంటర్నేషనల్ ఎక్లైమ్డ్ గా గుర్తింపు తెచ్చుకున్న దీపిక పడుకొనే గత నెలలో వోగ్, కాస్ మ్యాగజైన్ల కోసం ఫోటోలు దిగేందుకు లిమాకు వెళ్లారు. అక్కడ మిరా ఫోర్స్స్ పార్క్ హోటల్ లోని ప్రెసిడెన్షియల్ సూట్ లో ఆమె కొన్ని రోజులున్నాయి. గతంలో ఇదే ప్రెసిడెన్షియల్ సూట్ లో బిల్ క్లింటన్, దురన్ దురన్, టామీ హిల్ ఫైగర్ వంటి ప్రముఖులు విడిది చేశారు.
ఇంతవరకూ తాను చూసిన అద్భుత కట్టడాలన్నింటోనూ ప్రెసిడెన్షియల్ ప్యాలస్ ఎంతో విలక్షణమైనదనీ, వర్ణించడానికి మాటలు చాలవనీ దీపిక తన స్పందనను తెలియజేసింది. పెరూ ప్రజలు తన పట్ల చూపిన ఆదరాభిమానాలను జీవితాంత తన హృదయంలో పదిలంగా ఉంచుకుంటానని పేర్కొంది. పెరూ ఫ్యాషన్ షోలో తాను కలుసుకున్న టూరిజం మంత్రి దగ్గర నుంచి స్థానిక మార్కెట్ లోని షాప్ కీపర్ వరకూ అందరూ ఎంతో ప్రేమతో తనను పలకరించారనీ, వారు చూపిన ప్రేమాభిమానాలతో తన మనసంతా కృతజ్ఞతాభావం నిండిపోయిందనీ చెప్పుకొచ్చింది.
News Posted: 8 June, 2009
|