కిరణ్ రావుకు మూడో నెల
అమీర్ ఖాన్ మళ్లీ తండ్రి కాబోతున్నారు. ఆయన భార్య కిరణ్ రావు కు ఇప్పుడు మూడో నెల. కిరణ్ రావుకు ఇటీవల జ్వరం రావడంతో దక్షిణ ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు ఆమె ప్రెగ్నంట్ అని నిర్దారించారు. మే 31న జర్వంతో ఆసుపత్రికి వచ్చిన కిరణ్ రావు ను ఓల్డ్ హాస్పిటల్ బిల్డింగ్ లోని నాలుగో ఫ్లోర్ రూమ్ లో అడ్మిట్ చేశారనీ, వారం రోజుల పాటు ఆమె ఆసుపత్రిలోనే ఉన్నారనీ, ఇక్కడే ఆమెకు ప్రెగ్నన్సీ పరీక్షలు నిర్వహించారనీ విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
కిరణ్ రావు ఆసుపత్రిలో ఉన్నన్ని రోజులూ అమీర్ రోజూ రాత్రి 9 గంటల ప్రాంతంలోనే వచ్చేవారనీ, ఈ విషయానికి పెద్ద ప్రచారం ఉండకూడదనే అభిప్రాయం ఇందుకు కారణం కావచ్చనీ ఆ వర్గాలు తెలిపాయి. కాగా, అమీర్ కు ఇది మూడో సంతానం కానుంది. మొదటి భార్య రీనా దత్తాకు జునైద్ అనే కుమారుడు, ఐరా అనే కుమార్తె ఉన్నారు. 2002 డిసెంబర్ లో ఆయన రీనాకు విడాకులు ఇచ్చారు. 2005లో కిరణ్ రావును పెళ్లాడారు. అప్పట్నించీ కిరణ్ రావు గర్భవతనే పుకార్లు షికారు చేసినప్పటికీ ఈసారి అవి వాస్తవరూపం దాల్చాయి.
News Posted: 9 June, 2009
|