'వేశ్య'గా బిపాసా
బిపాసా బసుకు ఇలాంటి అవసరం ఏముందనే ఆత్రం వద్దు. బిపాసా మరో బోల్డ్ క్యారెక్టర్ ను పోషించడానికి సిద్ధమమవుతోందని చెప్పడమే మన ఉద్దేశం. బిపాసా ప్రధాన పాత్రలో 'పంఖ్' చిత్రాన్ని తీసిన సుదీప్తో చటోపాధ్యాయ మరో సంచలన చిత్రానికి కూడా శ్రీకారం చుట్టబోతున్నారు. మళ్లీ బిపాసాను ఇందులో నటింపజేసేందుకు ఆయన ఎంతో ఆరాటపడుతున్నారు. కోల్ కతాలోని అతిపెద్ద రెడ్ లైట్ ఏరియాగా పేరున్న 'సోనాగచి'లో నివసించే పడుపుగత్తె పాత్రకు బిపాసాను ఆయన ఎంచుకున్నారు. ఈ చిత్రానికి 'సోనాగచి' అనే టైటిల్ ను కూడా అనుకుంటున్నారు.
బిపాసా నటన పట్ల ఎంతో ముగ్దుదైన సుదీప్తో తన తదుపరి చిత్రంలోనూ ఓ బోల్డ్ క్యారెక్టర్ కు ఆఫర్ చేసినట్టు సినీ వర్గాలు తెలిపాయి. పెడోఫిలియా బాధితుడైన ఓ పిల్లవాడని సాకే వ్యభిచారిగా బిపాసా పాత్ర ఉంటుందనీ, ఈ చిత్రంలో నటించేందుకు సూచనప్రాయంగా బిపాసా అంగీకరించిందనీ, అయితే ఇంకా ఎలాంటి అగ్రిమెంట్ జరగలేదనీ ఆ వర్గాలు వెల్లడించాయి. బాధితుడైన పిల్లవాడి తల్లి పాత్రలో ఓ పెద్ద స్టార్ నటించబోతున్న విషయం నిజమేనని సుదీప్తో వివరించారు. సోనాగచి గురించి, అక్కడ జీవనం సాగిస్తున్న వ్యభిచారులు, వారు ఏవిధంగా వంచనకు గురవుతున్నారు, వారి మధ్య ఎలాంటి అత్మీయ అనుబంధాలు చోటుచేసుకుంటాయనే అంశాలన్నీ ఈ చిత్రంలో ఉంటాయని తెలిపారు. ఆసక్తికరంగా ఇదే ఏరియాలో వ్యభిచారులుగా కాలం వెళ్లదీస్తున్న వారు తమ నిజజీవిత పాత్రలనే ఇందులో పోషించబోతున్నారు. ఇక్కడ జరిగే దుర్గాపూజ సన్నివేశాలను ఇప్పటికే చిత్రీకరించామనీ, సోనాగచిలోని వ్యభిచారులు పడుపువృత్తి చేస్తున్న పాత్రల్లోనే కనిపిస్తారని సుదీప్తో వెల్లడించారు.
News Posted: 10 June, 2009
|