'మిల్క్ షేక్' మల్లికపై సాంగ్
బాలీవుడ్ బాంబ్ షెల్ మల్లికా షెరావత్ ఇప్పుడు లాస్ ఏంజెల్స్ పార్టీ సర్క్యూట్స్ లోనూ సంచలనం సృష్టించబోతోంది. ఈమధ్యనే లాస్ ఏంజెల్స్ లోని ఓ మిల్క్ షేక్ బార్ ఎకాఎకిన తాము అందించే ఓ మిల్క్ షేక్ కు మల్లిక అనే పేరు పెట్టి హాట్ హాట్ అమ్మకాలు సాగించింది. దీంతో మల్లిక పేరు ఒక్కసారిగా అక్కడ ప్రచారంలోకి వచ్చేసింది. ఆసక్తికరంగా ఇప్పుడు ప్రముఖ ఆర్ అండ్ బి సూపర్ స్టార్ ఉషర్ తాను కంపోజ్ చేయనున్న ఓ పాటను మల్లికకు అంకితం ఇవ్వబోతున్నారు. ఉషర్ రికార్డింగ్ ఆర్టిస్టుగానే గాక, ఆల్బమ్స్ తోనూ, టీవీ సిరీస్ లతోనూ మంటి పాపులారిటీని సొంతం చేసుకున్నారు.
మల్లిక తొలిసారి 'హిస్స్..'అనే హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటిస్తోంది. ఇందుకోసం లాస్ ఏంజెల్స్ లో ఉన్న మల్లిక ఇటీవల ఉషర్ ను కలుసుకుంది. లాస్ ఏంజెల్స్ బెస్ట్ బ్రంచ్ షోరూంలో సింగర్ ఉషర్ ను తాను కలుసుకున్నాననీ, ఆయన ఎంతో హ్యాండ్ సమ్ గా ఉన్నారనీ మల్లిక కితాబిచ్చింది. 'నాకు ఓ సాంగ్ ను అంకితమిస్తానని ఉషర్ వాగ్దానం కూడా చేశారు' అని మల్లిక తన మైక్రోబ్లాగింగ్ పేజ్ లో సంబరంగా చెప్పుకొచ్చింది.
News Posted: 17 June, 2009
|