'గ్యాంగ్ స్టర్' హీరో షైనీ అహుజా ఇప్పుడు 'రేపిస్ట్ హీరో'గా మారి తన ఇంట్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడనే వార్త హిందీ పరిశ్రమకు షాక్ ఇచ్చింది. అత్యాచారం అభియోగంపై ఆదివారంనాడు ముంబై పోలీసులు ఆయనను అరెస్టు చేసినప్పుడు పరిశ్రమ వర్గాల నుంచి కొంత సంఘీభావం కూడా వ్యక్తమైంది. అయితే ఈ కథలో మరో కొత్త మలుపు చోటుచేసుకుంది. పనిమనిషిపై ఆయన అత్యాచారం జరిపినట్టు వైద్య పరీక్షలో తేలడంతో షైనీ అహుజా తలవంచక తప్పలేదు. 'నేను చాలా పెద్ద పొరపాటు చేశాను' అని ఆయన ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
'ఇలాంటి చర్యకు పాల్పడటం ద్వారా చాలా పెద్ద పొరపాటే చేశారు. ఆ సంఘటన తర్వాత ఎవరికీ చెప్పకుండా సైలెంట్ గా ఉండాల్సిందిగా ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాను. ఆమె ఎవరికీ చెప్పదనే నమ్మకంతో కూడా ఉన్నాను. ఆమె పెదవి విప్పకుండా ఉండేందుకు ఏది కోరితే అది ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాను. ఏదేమైనా పెద్ద పొరపాటే జరిగింది' అని షైనీ విచలిత మనస్కుడై తన తప్పిదం ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. తనను బెడ్ రూమ్ లోకి తీసుకువెళ్లి బలాత్కారం చేసినట్టు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తాము ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఈ అత్యాచారం సంఘటన షైనీ ఇంట్లో జరిగింది. ఆ సమయంలో అతని భార్య ఇంట్లో లేదు. ఇప్పటికే భార్యాభర్తల మధ్య అంత అనుకూలత లేదని తెలుస్తుండగా తాజా సంఘటనతో పరిస్థితి మరింత క్లిష్ట పరిస్థితిలో పడినట్టు చెబుతున్నారు. షైనీ నేరాంగీకారానికి ముందు పరిశ్రమకు చెందిన పలువురు అతనికి క్లీన్ చిట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చారనీ, అయితే అయితే ఇప్పుడు షైనీ తనంత తానుగా ఒప్పుకోవడంతో తన మద్దతుదారుల విశ్వాసాన్ని కూడా ఆయన కోల్పోయినట్టు కనబడుతోందనీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కొద్దికాలం క్రితం హీరో ఆదిత్య పంచోలిపై కూడా పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన అభియోగం వచ్చింది. పర్యవసానంగానే పూజా బేడీ ఆయనకు దూరమైంది.