గాయపడిన ఆసిన్
మలయాళీ హాట్ బ్యూట్ ఆసిన్ కేరళలో 'కలరియపట్టు' అనే మార్షల్ ఆర్ట్ ప్రాక్టీస్ సందర్భంగా గాయపడింది. కుడి కాలికి తగిలిన బలమైన గాయం వల్ల కాలు బాగా వాచిపోయింది. దీంతో అడుగుతీసి అడుగువేయలేనంత బాధతో ఆమె విలవిలలాడుతోంది. మరి కొద్దిరోజుల్లోనే జరుగనున్న ఫిల్మ్ అవార్డుల ఫంక్షన్ లో ఆసిన్ ర్యాంల్ వ్యాక్ చేయవలసి ఉంది. అయితే తన కమిట్ మెంట్ నుంచి వైదొలగే ప్రసక్తే లేదనీ, తన తల్లిదండ్రుల నుంచే తాను ఈ తరహా క్రమశిక్షణ తనకు అలవడిందని ఆసిన్ ధీమా వ్యక్తం చేస్తోంది. కాలికి తగిలిన గాయం బాధిస్తున్నప్పటికీ అలోపతికి మెడిసెస్ కూడా తీసుకోకుండా నిబ్బరాన్ని ప్రదర్శిస్తోంది. ప్రస్తుతం అంధేరి లోని గ్రీన్స్ ఏకర్స్ లోని సొంత ఇంట్లో ఆమె విశ్రాంతి తీసుకుంటోంది.
కాలికి గాయం తగలడం, అలోపతి మెడిసన్ తీసుకోకపోవడం నిజమేనని ఆసిన్ ధ్రువీకరించింది. 'కృత్రిమమైన ఆహారం, స్పైసెస్ వంటివి తీసుకోవడం అలవాటులేని వాతావరణంలో చిన్నప్పటి నుంచి పెరిగాను. మా ఇళ్ళలో చక్కెరను వైట్ పాయిజన్ గా భావిస్తాం. అందుకు బదులుగా బెల్లం మాత్రమే వాడతాం. బయటి డ్రింకులు, చాకిలేట్లు, అలోపతి మెడిసన్లు ఎప్పుడూ తీసుకోను. ఆయుర్వేద చికిత్స మాత్రమే తీసుకుంటాను' అంటూ చెప్పుకొచ్చింది. ఇన్నాళ్లూ తండ్రి కూచిగానే అందరికీ తెలిసిన ఆసిన్ తన కాలికి గాయమైన వెంటనే తల్లిదండ్రుల ఇంటికి కాకుండా నేరుగా తన కొత్త ఇంటికే వెళ్లి అక్కడే తగిన చికిత్స తీసుకుంటూ ఒంటరిగా ఉంటోంది. 'ఇందులో ఆశ్చర్యపడేందుకు ఏముంది? నాన్నగారి ఎప్పుడూ నా పక్కనే ఉండటం వల్ల ఆయన లేకుండా ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేనని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. నిజానికి అమ్మానాన్నలకు నేను ఒక్కతే కూతుర్ని అయినా నా కాళ్ల మీద నన్ను నిలబడేలా పెంచారు' అంటూ ఆసిన్ చెప్పుకొచ్చింది. ఆమె ప్రస్తుతం ఉంటున్న కొత్తింటికి కూతవేటు దూరంలోనే తల్లిదండ్రుల నివాసం ఉంది. అయినప్పటికీ ఆసిన్ వారి సహాయాన్ని ఆశించడం లేదు. 'రెండు కిలోమీటర్ల దూరంలోనే అమ్మానాన్న ఉన్నారు. అయితే వాళ్లెవరూ ఇక్కడకు రాలేదు. నేను కూడా వెళ్లలేదు. విశాలమైన ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉంటున్నాను. ఇప్పుడు దొరికిన తీరికను ఇంట్లో ఉండడానికే కేటాయిస్తున్నాను. కొత్త ఫ్రెండ్స్ అంటే ఇష్టం. అలాగే ఆత్మస్థైర్యంతో ఉండటం ఎలాగో అభ్యాసం చేస్తున్నాను' అంటూ నవ్వుతూ చెప్పింది.
News Posted: 19 June, 2009
|