ప్రియాంక-అశుతోష్ హ్యాపీ!
12 రాశులు...12 క్యారెక్టర్లు...12 పాటలు. ఇవేం లెక్కలనుకుంటున్నారా? జాతక చక్రంలో ఉండే రాశులు 12 అయితే, ఒక్కో రాశికి ఒక్కో పాట చొప్పున 12 పాటల్లో ప్రియాంక చోప్రా కనిపించబోతోంది. 'వాట్స్ యువర్ రాశి' చిత్రం ద్వారా ఈ క్రెడిట్ ను ప్రియాంక దక్కించుకోనుంది.'లగాన్', 'స్వదేశ్', 'జోథా అక్బర్' వంటి సంచలన చిత్రాల ఫిల్మ్ మేకర్ అశుతోష్ గోవారికర్ ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక సరసన హర్మాన్ బవేజా నటిస్తున్నారు. యూటీవీ మోషన్ పిక్చర్స్, అశుతోష్ గోవారికర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆసక్తికరంగా అశుతోష్ గతంలో చేసిన వ్యాఖ్యలతో ప్రియాంక చోప్రా మనస్థాపం చెందినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. 'వాట్స్ యువర్ రాశి' చిత్రంలో ప్రియాంకకు 12 సాంగ్స్ క్రెడిట్ ఇవ్వడం ద్వారా ఇప్పుడు ఇద్దరి మధ్యా ప్యాచప్ జరిగినట్టు బాలీవుడ్ వర్గాల భోగట్టా.
'ఫ్యాషన్' చిత్రానికి ఉత్తమనటి అవార్డు ప్రియాంక చోప్రాను వరించిన సందర్భంలో అశుతోష్ సంచలన వ్యాఖ్య చేశారు. ప్రియాంక కంటే 'జోథా అక్బర్'లో నటించిన ఐశ్వర్య అన్ని విధాలా అర్హురాలనే అభిప్రాయాన్ని అశుతోష్ వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో ప్రియాంక మనస్థాపం చెందిందనే వార్తలూ వచ్చాయి. అయితే ఆ పరిస్థితులు మరీ వికటించలేనట్టే కనపిస్తోంది. అశుతోష్-ప్రియాంక ఇప్పుడు ఒకరి పట్ల మరొకరు ఎంతో గౌరవం కనబరుస్తారని, ఎలాంటి పొరపొచ్చాలు లేవనీ సినీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి 'వాట్స్ యువర్ రాశి'లోని 12 సాంగ్స్ ముందుగా ప్లాన్ చేసుకున్నవే అయినందున అశుతోష్ స్టయిల్ లోనే వేటికవే ప్రత్యేకంగా ఉంటాయనీ వారంటున్నారు. ప్రియాంకను ఇదే విషయమై సంప్రదించినప్పుడు 'వివిధ రాశి చక్రాలను ప్రతిబింబించే 12 క్యారెక్టర్లు ఇందులో ఉన్నాయి. అందుకే 12 సాంగ్స్ ఉన్నాయి. సంగీత దర్శకుడు సోహైల్ సేన్ వీటిని కంపోజ్ చేస్తున్న విధానం అత్యద్భుతంగా ఉంటుంది. ప్రతి సాంగ్ వేటికవే ప్రత్యేకతను సంతరించుకుని ఆయా క్యారెక్టర్లను కళ్లముందు నిలుపుతుంది' అంటూ సంబరంగా చెప్పుకొచ్చింది. మొత్తానికి ప్రియాంక, అశుతోష్ మధ్య తలెత్తినట్టు చెబుతున్న మనస్పర్థలు తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది.
News Posted: 20 June, 2009
|